హైలైట్స్:
- లాంచ్ కి ముందు లీకైన Tecno Pova Neo 5G డిజైన్, స్పెసిఫికేషన్స్
- 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న Tecno Pova Neo 5G
- ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుందని సమాచారం
భారత మార్కెట్ లో Tecno Pova Neo 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు టెక్నో కంపెనీ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 23 న Tecno Pova Neo 5G ఎంట్రీ ఇస్తుందని సదరు సంస్థ ప్రకటించింది. Tecno Pova Neo 5G 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని లాంచ్ కి ముందు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో ప్రైస్‌బాబా Tecno Pova Neo 5G యొక్క డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలను లీక్ చేసింది. రిపోర్ట్ ప్రకారం Tecno Pova Neo 5G ధర భారత్ లో రూ.20,000 గా ఉండనుంది. మరి Tecno Pova Neo 5G స్మార్ట్ ఫోన్ డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Get ready to say goodbye to battery anxiety with the TECNO POVA NEO 5G, a smartphone with 6000mAh mega battery & 18W flash charger. .
Choose the best of its kind & unleash the powerful battery!
Launching on 23rd of September.
#TECNO #TecnoMobile #TECNOPOVANEO5G #POVANEO5G pic.twitter.com/2pLAtl5iUd— TECNO Mobile India (@TecnoMobileInd) September 21, 2022
Tecno Pova Neo 5G: డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్
నివేదికను బట్టి, Tecno Pova Neo 5G 6.9-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉండనుందని సమాచారం. ఈ ఫోన్లో టెక్నో హయ్యర్ రిఫ్రెష్ రేట్ ప్లాన్ చేస్తుందా లేదా స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ నే అందిస్తుందా అనేది ఇంకా తెలియదు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత HiOS కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
Tecno Pova Neo 5G 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ని కలిగి ఉండనుంది. Tecno Pova Neo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా ఉంటుందని అంచనా. Tecno Pova Neo 5G సఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Tecno Pova Neo 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని టెక్నో సంస్థ స్పష్టం చేసింది.
Tecno Pova Neo 5G ధర (అంచనా)
రిపోర్ట్ ప్రకారం చూస్తే, Tecno Pova Neo 5G ధర భారత్ లో రూ.17,000 నుంచి రూ.19,000 మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్పష్టత ఫోన్ లాంచ్ అయ్యాకే తెలుస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత 6.9-ఇంచ్ భారీ సైజు కలిగిన అమోలెడ్ ప్యానెల్ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.