ఇస్రో లాంచ్ చేసిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 మిషన్ గౌరవార్థం టెక్ కంపెనీ టెక్నో తాజాగా Tecno Spark 10 Pro మూన్ ఎక్స్‌ప్లోరర్ స్పెషల్ ఎడిషన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతం Tecno Spark 10 Pro మూన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ యొక్క ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. మీకు సమీపంలోని రిటైల్ స్టోర్స్ ద్వారా ప్రీబుకింగ్స్ చేసుకోవచ్చు.
Tecno Spark 10 Pro డిజైన్
ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయి విజయబావుటా ఎగురు వేసింది. దేశం మొత్తం ఆ సంబరాల్లో మునిగితేలింది. ఇక చంద్రయాన్ 3 విజయాన్ని పురస్కరించుకుని టెక్నో సంస్థ Tecno Spark 10 Pro మూన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్-టోన్ లెదర్ ఫినిష్ తో వచ్చింది. రెగ్యులర్ వేరియంట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో ఉంటుంది.
Tecno Spark 10 Pro Moon Explorer Edition ధర, లభ్యత
Tecno Spark 10 Pro మూన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ ప్రీబుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కాగా, సెప్టెంబర్ 15 నుంచి అఫీషియల్ సేల్స్ మొదలవుతాయి.
Tecno Spark 10 Pro Moon Explorer ఎడిషన్ స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Tecno Spark 10 Pro లో 6.78-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Spark 10 Pro లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 10 Pro లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ అందించారు.
- సాఫ్ట్వేర్: Tecno Spark 10 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Tecno Spark 10 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Tecno Spark 10 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Spark 10 Pro లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
