ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో త్వరలో Tecno Spark 10C స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన ఫోన్లను అందిస్తూ తక్కువ సమయంలోనే టెక్నో కంపెనీ మంచి పేరు సంపాదించింది. అయితే Tecno Spark 10C కి సంబంధించి కంపెనీ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.
తాజాగా Tecno Spark 10C డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో Tecno Spark 10C స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Google Play Console పై కనిపించిన Tecno Spark 10C
Tecno Spark 10C స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. ఈ డివైజ్ Tecno KI5k అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ డివైజ్ 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, హెచ్డీ+ డిస్ప్లే, 320 పీపీఐ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉందని పిక్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
Tecno Spark 10C స్మార్ట్ ఫోన్ లో UniSoC T606 ప్రాసెసర్ వాడినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. 4జిబి ర్యామ్ ఆప్షన్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది. అయితే మిగతా ర్యామ్, మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. Tecno Spark 10C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచ్ కానుంది.
టెక్నో సంస్థ ఇటీవలె Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ తో లాంచైంది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్
Tecno POP 7 Pro లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే ప్యానెల్ 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. Tecno POP 7 Pro లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీపీయూ వాడారు. పోకో సీ50, లావా ఎక్స్3, రెడ్మీ ఏ1 వంటి ఎంట్రీ లెవెల్ ఫోన్లలో హీలియో ఏ22 చిప్సెట్ ని వాడటం జరిగింది. ఇకపోతే Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆధారిత హైఓఎస్ 11.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Tecno POP 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. Tecno POP 7 Pro డివైజ్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయిని బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 12ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఒక ఏఐ లెన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ లో కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఇవ్వడం విశేషం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
