
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Tecno త్వరలో Spark 20 అనే స్మార్ట్ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ కంపెనీ, Tecno Spark 20 ఇండియా లాంచ్ ని ఖరారు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో టీజర్ ని షేర్ చేసి ప్రకటించింది. మరో విషయం ఏంటంటే, Tecno Spark 20 ఫోన్ ఇప్పటికే టెక్నో గ్లోబల్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. భారత్ లో కూడా ఇవే స్పెసిఫికేషన్స్ తో Tecno Spark 20 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 ఇండియా లాంచ్ ఖరారు
- Tecno Spark 20 స్మార్ట్ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా టెక్నో ఇండియా ప్రకటన చేసింది.
- అయితే Tecno Spark 20 లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. త్వరలోనే తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది.
- Tecno Spark 20 డివైజ్ సూపర్ స్టోరేజీ, ఉత్తమమైన సెల్ఫీ కెమెరాతో రానుందని తన పోస్ట్ లో టెక్నో పేర్కొంది.
- Tecno షేర్ చేసిన Tecno Spark 20 డివైజ్ ని గమనిస్తే.. పవర్, వాల్యూమ్ రాకర్, కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి.
Does your heart beat for #TheUncompromised Storage & Selfie Camera?
Welcome to #TheUncompromised side!Coming Soon | Stay Tuned
Stay tuned for the next tweet to find out how to participate in the giveaway#TECNOSmartphones pic.twitter.com/siCvkMA7NE— TECNO Mobile India (@TecnoMobileInd) January 24, 2024
Tecno Spark 20 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- స్క్రీన్: Tecno Spark 20 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ తో Tecno వెబ్సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ ఫ్లాష్ ఇచ్చారు.
- బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ స్పీకర్స్, ఎఫ్ఎమ్, ఓటీజీ, ఐపీ53 ఉంటాయి.











