ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Spark 20 అనే డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇంకా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే ఈలోపే ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ లో Tecno Spark 20 లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా Tecno Spark 20 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్, పంచ్ హోల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. సరే, ఓసారి Tecno Spark 20 కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 అమెజాన్ లిస్టింగ్
- Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కి ముందు అమెజాన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది.
- Tecno Spark 20 గ్లోబల్ వేరియంట్ లాగే ఇండియన్ వేరియంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
- Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Tecno Spark 20 డివైజ్ 256జిబి స్టోరేజీ, డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 1టిబి మెమొరీ ఎక్స్‌ప్యాన్షన్ సపోర్ట్ తో వస్తోంది.
Tecno Spark 20 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Tecno Spark 20 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ తో Tecno వెబ్సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ ఫ్లాష్ ఇచ్చారు.
- బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ స్పీకర్స్, ఎఫ్ఎమ్, ఓటీజీ, ఐపీ53 ఉంటాయి.
