ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno తాజాగా స్పార్క్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ హ్యాండ్సెట్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Tecno Spark 20 Pro 5G ధర, కలర్ ఆప్షన్స్
Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ సౌదీ అరేబియాలో జూన్ 20వ తేదీ నుంచి సేల్‌కి వస్తోంది. తర్వాత మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్‌ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికాల్లో లాంచ్ అవుతుంది.
Tecno Spark 20 Pro 5G ధరను 190 డాలర్లు (సుమారు రూ.15,000) నిర్ణయించారు.
Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ స్టార్ ట్రెయిల్ బ్లాక్, గ్లాసీ వైట్ మరియు నియాన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ మూడింట్లో ఒకటి వీగన్ లెదర్ వేరియంట్ కాగా, మిగతా రెండు గ్లాసీ ఫినిష్ తో ఉంటాయి.
Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.
కెమెరా: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
మెమొరీ: Tecno Spark 20 Pro 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Tecno Spark 20 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.
ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, టైప్-సీ పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
