ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నుంచి త్వరలో కొత్త Spark సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు. అలాగే డివైజ్ ఫోటోని కూడా షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
స్క్రీన్: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ ఉంటుంది.
కెమెరా: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది.
బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Tecno Spark 20 Pro 5G ధర (లీక్)
Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ నెలలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇండియా లాంచ్ తేదీ ప్రకటన వెలువడనుంది.
