చవక ఫోన్ల తయారీ సంస్థ TECNO మరొక లో-బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. TECNO Spark 20 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే TECNO Spark 20 సిరీస్ లో Tecno Spark 20, Spark 20 5G, Spark 20 Pro, Spark 20C అనే ఫోన్లు ఉన్నాయి. రీసెంట్ గా TECNO Spark 20C యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు TECNO Spark 20 Pro డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కనిపించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
TECNO Spark 20 Pro బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్
- బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ప్రకారం, టెక్నో నుంచి రాబోవు కొత్త డివైజ్ KJ6 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.
- TECNO Spark 20 Pro పేరుతో ఈ ఫోన్ రానున్నట్లు లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.
- TECNO Spark 20 Pro డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో రాబోతోందని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
- బ్లూటూత్ కనెక్టివిటీ సమాచారం మినహా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలు లిస్టింగ్ ద్వారా తెలియలేదు.
రీసెంట్ గా లీకైన TECNO Spark 20C స్మార్ట్ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని మరోసారి తెలుసుకుందాం పదండి.
TECNO Spark 20C స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Tecno Spark 20C లో 6.67-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్ ఉంటుందని సమాచారం. గీక్ బెంచ్ ద్వారా ఈ విషయం తెలిసింది.
- మెమొరీ: Tecno Spark 20C లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటాయి.
- కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
- బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
