Tecno Spark 20 Pro స్మార్ట్ఫోన్ నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ దేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో వచ్చింది. Tecno Spark 20 Pro లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno Spark 20 Pro ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Tecno Spark 20 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20 Pro లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి-జీ57 ఎంపీ2 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Tecno Spark 20 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Tecno Spark 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో ఐపీ53 రేటింగ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
Tecno Spark 20 Pro ధర
- Tecno Spark 20 Pro డివైజ్ ఫిలిప్పైన్స్ దేశంలో లాంచ్ అయ్యింది. అక్కడ సింగిల్ మెమొరీ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను PHP 5,599 (సుమారు రూ.8,500) గా నిర్ణయించారు.
- Tecno Spark 20 Pro డివైజ్ మూన్లిట్ బ్లాక్, ఫ్రాస్టీ ఐవరీ, సన్సెట్ బ్లష్, మ్యాజిక్ స్కిన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Tecno Spark 20 Pro డివైజ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా స్పష్టత రాలేదు.
