తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఫోన్లను అందిస్తోంది TECNO సంస్థ. దీంతో ఈ కంపెనీ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ బాగానే ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంస్థ మిడ్ రేంజ్ నుంచి ప్రీమియమ్ రేంజ్ ఫోన్లను కూడా లాంచ్ చేయడం మొదలు పెట్టింది. అయితే తనకు పట్టున్న ఎంట్రీ లెవెల్ ఫోన్ సెగ్మెంట్ లో Tecno Spark Go 2023 ని త్వరలో లాంచ్ చేయబోతోంది.
Tecno Spark Go 2023 యొక్క లైవ్ ఇమేజ్ PassionateGeekz వెబ్ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. ఇకపోతే కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. సరే, ఓసారి Tecno Spark Go 2023 యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్, భారత్ లో ధర తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.
భారత్ లో Tecno Spark Go 2023 ధర, లైవ్ ఇమేజెస్
Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఆఫ్ లైన్ మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ భారత్ లో 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. టిప్ స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ రూ.6,999 ధరతో లాంచ్ కానుంది. POCO C50, Redmi A1 ఫోన్లతో Tecno Spark Go 2023 పోటీపడనుంది. ఇక Tecno Spark Go 2023 గ్లోబల్ వేరియంట్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో రానుంది.
రిపోర్ట్ Tecno Spark Go 2023 యొక్క రిటైల్ బాక్స్ మరియు యూనిట్ ని కూడా రివీల్ చేసింది. బాక్స్ ద్వారా స్టోరేజీ ఆప్షన్ మరియు ఫోన్ పేరు తెలుస్తున్నాయి. దీంతో పాటు, లైవ్ ఇమేజ్ ద్వారా అన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. లీకైన లైవ్ ఇమేజ్ ద్వారా, ఈ ఫోన్ 6.55-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోందని స్పష్టమైంది.
Tecno Spark Go 2023 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు. అలాగే లైవ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి.
Tecno Spark Go 2023 లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ లో ఏఐ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. గుగ్లాని షేర్ చేసిన పోస్టర్ లో మూడు కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.
Tecno Spark Go 2023 ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ మరియు 3 కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఎండ్‌లెస్ బ్లాక్, యూని బ్లూ, నెబులా పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ లభించనుంది. స్క్వేర్ షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. ఆఫ్ లైన్ మార్కెట్స్ తో పాటు, అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
