Home News రూ.6,999 ధరతో భారత్‌లో లాంచైన Tecno Spark Go 2023

రూ.6,999 ధరతో భారత్‌లో లాంచైన Tecno Spark Go 2023

Highlights
  • భారత్ లో లాంచైన Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్
  • 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • భారత్ లో Tecno Spark Go 2023 ధర రూ.6,999

భారత్ లో Tecno Spark Go 2023 అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ లాంచైంది. వాటర్ డ్రాప్ నాచ్, 90 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, పీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, భారీ రియర్ కెమెరా మాడ్యూల్, డ్యూయల్ కెమెరా సెన్సర్స్, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో Tecno Spark Go 2023 మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ, నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ ప్యాటర్న్ ఫినిషింగ్ తో వచ్చింది.

Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. సరే, ఇప్పుడు Tecno Spark Go 2023 ఫోన్ ధర, లభ్యత, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.

భారత్ లో Tecno Spark Go 2023 ధర, లభ్యత

Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. ఎండ్‌లెస్ బ్లాక్, ఉయిని బ్లూ, నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. జనవరి 23 నుంచి ఈ ఫోన్ రిటైల్ స్టోర్స్ ద్వారా అమ్ముడవుతుంది.

Tecno Spark Go 2023 స్పెసిఫికేషన్స్