Tecno సంస్థ తన స్పార్క్ సిరీస్ చౌక ఫోన్ Tecno Spark Go 2024 ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Tecno Spark Go 2024 ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. కంపెనీ షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఫోన్ డిసెంబర్ 4న భారతదేశంలో లాంచ్ అవుతుంది. Tecno Spark Go 2023 యొక్క సక్సెసర్ గా Tecno Spark Go 2024 మార్కెట్ లోకి వస్తోంది. ఈ సెగ్మెంట్ లో డీటీఎస్ డ్యూయల్ స్పీకర్స్ తో వస్తోన్న మొదటి ఫోన్ గా Tecno Spark Go 2024 నిలవనుంది.
Tecno Spark Go 2024 ధర
- అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, Tecno Spark Go 2024 ధర భారత్ లో రూ.8,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.
- Tecno Spark Go 2024 లో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఫోన్ ఖరీదైన ఐఫోన్ లో కనిపించే డైనమిక్ పోర్ట్ వంటి ఫీచర్ తో వస్తోంది.
- Tecno Spark Go 2024 లో అందిస్తోన్న డైనమిక్ పోర్ట్ ఫీచర్ ద్వారా కాలర్ ఐడీ, చార్జింగ్ పర్సెంటేజీ వంటి ఇతర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సమాచారం ఫ్రంట్ కెమెరా కటౌట్ వద్ద పిల్ షేప్ లో కనిపిస్తుంటుంది.
- Tecno Spark Go 2024 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్, 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ తో వస్తోంది.
- Tecno Spark Go 2024 స్మార్ట్ ఫోన్ భారత్ కంటే ముందే మలేషియో మరియు ఫిలిప్పైన్స్ దేశాల్లో లాంచ్ అయ్యింది. కాబట్టి, భారత్ లో కూడా అదే మాదిరి స్పెసిఫికేషన్స్ తో Tecno Spark Go 2024 లాంచ్ అవ్వనుందని చెప్పవచ్చు. సరే, ఓసారి గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ చెక్ చేద్దాం.
Tecno Spark Go 2024 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Spark Go 2024 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Spark Go 2024 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark Go 2024 లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- కెమెరా: Tecno Spark Go 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముందువైపు కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- బ్యాటరీ: Tecno Spark Go 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Tecno Spark Go 2024 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Spark Go 2024 లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
