రివీలైన Tecno Spark Go 2024 ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark Go 2024
  • ఇప్పటికే లాంచైన Tecno Spark Go 2023
  • 3జిబి ర్యామ్‌తో వస్తోన్న Tecno Spark Go 2024

తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను ఆఫర్ చేసే స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంలో టెక్నో సంస్థ ముందు వరుసలో నిలుస్తోంది. ఇటీవలె భారతీయ మార్కెట్ లో Tecno Spark Go 2023 డివైజ్ ని లాంచ్ చేసిన టెక్నో, ఇప్పుడు దీనికి సక్సెసర్ Tecno Spark Go 2024 ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలె Tecno Spark Go 2024 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. అలాగే థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ ని కూడా పొందింది. సరే, ఓసారి Tecno Spark Go 2024 డివైజ్ స్పెసిఫికేషన్స్, లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark Go 2024 స్పెసిఫికేషన్స్ (లిస్టింగ్)

Tecno Spark Go 2024 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై BG6IN అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఇంకా థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

  • ర్యామ్: Tecno Spark Go 2024 డివైజ్ 3జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది.
  • ఓఎస్: Tecno Spark Go 2024 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • చిప్సెట్: Tecno Spark Go 2024 డివైజ్ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి జీ57 జీపీయూ వాడనున్నారు.

Tecno Spark Go 2024 డిజైన్ (లిస్టింగ్)

  • లిస్టింగ్ ప్రకారం, Tecno Spark Go 2024 డివైజ్ 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, 320పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన ఫోటో ద్వారా Tecno Spark Go 2024 డివైజ్ పంచ్-హోల్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
  • Tecno Spark Go 2024 డిస్ప్లే బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది.
  • ఫోన్ కి పై భాగాన స్పీకర్ ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి సైడ్ ఫ్రేమ్ పై ఉన్నాయి.

Tecno Spark Go 2023 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 480 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్, మెమొరీ: ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ లభిస్తుంది. స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Tecno Spark Go 2023 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Spark Go 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్ ఉంటుంది.
  • సెక్యూరిటీ: భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఐపీఎక్స్2 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Tecno Spark Go 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • చుట్టుకొలత: ఈ ఫోన్ 163.86 మిల్లీ మీటర్ల పొడవు, 75.51 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.
Previous articleNBTC సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Redmi 13C
Next article1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.