
Netflix లో టాప్-5 తెలుగు హారర్ సినిమాలు
సినీ ప్రేమికుల్లో హారర్ చిత్రాలను ఇష్టపడే ఓ ప్రత్యేక వర్గం ఉంటుంది. హారర్ చిత్రం వచ్చిందంటే వారికి పండగేనని చెప్పాలి. రాత్రివేళ దుప్పటి కప్పుకుని భయపడుతూ చూసే హారర్ మూవీ లవర్స్ కొందరైతే, నన్నేది భయపెట్టలేదని ధైర్యంగా చూసే వారు మరికొందరు. ఎలా అయితేనేం, హారర్ చిత్రాల పట్ల ఉన్న మక్కువతో భయం ఉన్నా ఏకపోయినా వాటిని ఎంజాయ్ చేయక మానరు. హారర్ చిత్రాల దర్శకులు తమ వినూత్నమైన ఐడియాలతో సన్నివేశాలను తీర్చిదిద్ది ప్రేక్షకులను మరింతగా భయపెడతారు.
ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కి జనాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో కూర్చొని కావాల్సిన జోనర్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్ లో మిమ్మల్ని భయపెట్టే పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుగు హారర్ చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. ఆ సినిమాలను చూడకపోతే చూసేయండి. ఒకవేళ ఇదివరకే చూస్తే, మరోసారి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించండి.
1. గేమ్ ఓవర్
సైకలాజికల్ హారర్ త్రిల్లర్ గా వచ్చిన గేమ్ ఓవర్ లో తాప్సీ పన్ను ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తాప్సీ నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తెలుగు, తమిళ వర్షన్స్ లో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
2. ఆవిరి
నటుడు, దర్శకుడు రవి బాబు దర్శకత్వంలో 2019 లో వచ్చిన చిత్రం ‘ఆవిరి’. ఆవిరి చిత్రంలో నేహా చౌహాన్, ప్రియా వడ్లమాని, రవి బాబు, శ్రీ ముక్తా, హిమజ, భరణి శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ హారర్ త్రిల్లర్ ని నెట్‌ఫ్లిక్స్ లో చూడండి.
3. భూమిక
ఆర్. రతీంద్రన్ ప్రసాద్ దర్శకత్వంలో 2021 లో వచ్చిన తమిళ సినిమా భూమిక. మాధురి జైన్, అవంతికా, ఐశ్వర్యా రాజేశ్, మాధురి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. నేరుగా ఈ చిత్రం ఓటీటీ లో విడుదలైంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని చూడండి.
4. గృహం
సిద్ధార్థ్, ఆండ్రియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 2017 లో The House Next Door గా తమిళంలో వచ్చిన ఈ చిత్రాన్ని గృహం పేరుతో తెలుగు లో విడుదల చేశారు. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనీశా విక్టర్ కీలక పాత్ర పోషించారు. ఈ హారర్ త్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
5. అంధకారం
అర్జున్ దాస్ ప్రధాన పాత్ర పోషించిన తమిళ సినిమా అంధకారం. దీని తెలుగు వర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అంధకారం చిత్రంలో పూజా రామచంద్రన్, వినోద్ కిషన్, మిషా ఘోషాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వి. విజ్ఞరాజన్ దర్శకత్వం వహించాడు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.