నాగచైతన్య నటించిన Thank You మూవీ ఓటీటీ అప్డేట్

హైలైట్స్:

  • గత నెలలో రిలీజ్ అయిన థాంక్యూ, సినిమాను నిర్మించిన దిల్ రాజు
  • ప్రధాన పాత్ర పోషించిన నాగచైతన్య, దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్
  • బాక్సాఫీస్ వద్ద నెగటివ్ రివ్యూలను మూటగట్టుకున్న థాంక్యూ, ఓటీటీ విడుదల తేదీ ఖరారు

థాంక్యూ సినిమాతో జులై నెల్లో థియేటర్లలోకి వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో చైతన్యకు భారీ ఓటమి తప్పలేదు. దాంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలు వచ్చాయి. దీంతో జులై లో టాలీవుడ్ సినిమాల అపజయాల పరంపర కొనసాగింది.

నెగటివ్ రివ్యూలను మూటగట్టుకున్న థాంక్యూ సినిమా త్వరలోనే ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. లాస్ లను పూడ్చుకోవాలని నిర్ణయించిన దిల్ రాజు, త్వరగా ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కి వదలాలని ఫిక్స్ అయ్యారు. ఆగస్టు 12 న అమెజాన్ ప్రైమ్ లో థాంక్యూ సినిమా స్ట్రీమ్ కానుంది.

సినిమా థియెట్రికల్ రిలీజ్ కి, ఓటీటీ రిలీజ్ కి కనీసం 10 వారాలు గ్యాప్ ఉండాలని గతంలో నిర్మాతల కౌన్సిల్ లో మాట్లాడిన దిల్ రాజు, తన మాటకు తానే కట్టుబడి ఉండకపోవడం గమనార్హం. ఊహించని విధంగా మొదటి రోజునే థాంక్యూ సినిమా డిజాస్టర్ అవ్వగా, నిర్మాతకు బలమైన దెబ్బ తగిలింది. అందుకే దిల్ రాజు, త్వరగా సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కి వదలాలని డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది.

చిత్ర తారాగణం:

థాంక్యూ చిత్రంలో నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, సాయి సుశాంత్ రెడ్డి, అవికా గోర్ ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇదివరకు విక్రమ్ కుమార్, నాగ చైతన్య కలిసి మనం అనే సినిమా చేశారు. మనం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే నమ్మకంతో నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కి మరొక అవకాశమిచ్చాడు. కానీ, ఈసారి ఫలితం తలక్రిందులైంది. దీంతో నాగ చైతన్య ఒక మాంచి హిట్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. త్వరలో లాల్ సింగ్ ఛడ్డా తో నాగ చైతన్య మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఆమిర్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రధారి. కాగా, నాగచైతన్య, బాలరాజు అనే కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం యొక్క ఫలితం పాజిటివ్ గా వస్తే, నాగ చైతన్యకు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశముంది. నేరుగా అక్కడ సినిమాలు చేసేందుకు ఇదొక బెస్ట్ చాన్స్ అని చెప్పవచ్చు. చివరగా నాగ చైతన్య, బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో ఆగస్టు 12 న ప్రసారమయ్యే థాంక్యూ సినిమాను కచ్చితంగా చూడండి.

Previous articleమళ్ళీ అమ్మకానికి వచ్చిన Nothing Phone (1)
Next articleMoto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.