
మనం ఎన్నోసార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటాం. అయితే కావాలని కాకపోయినా కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా జరుగుతుంటుంది. అయితే కారణమేదైనా, చలాన్ పడటం తప్పించుకోలేం కదా. ట్రాఫిక్ పోలీసుల కంటపడితే ఇక అంతే సంగతులు. చలాన్ ఫోన్ కి వచ్చేస్తుంది. అయితే మనకు వచ్చిన చలాన్ లను ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ కూడా చేసేయవచ్చు. ఆ సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
ఆన్‌లైన్ ద్వారా చలాన్ చెక్ చేయడం ఎలా?
స్టెప్ 1: చలాన్ చెక్ చేయాలంటే, మీరు echallan.parivahan.gov.in అనే వెబ్‌సైట్ కి వెళ్ళాలి. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ బ్రౌజర్ ద్వారా వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఈ వెబ్ సైట్ లో మీరు ‘check challan status’ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: ఇప్పుడు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ మీకు చలాన్ నంబర్, వెహికిల్ నంబర్ మరియు డీఎల్ నంబర్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో నుంచి వెహికిల్ నంబర్ ఆప్షన్ ని ఎంచుకోండి.
స్టెప్ 4: వెహికిల్ నంబర్ ఎంటర్ చేసాక, మీరు ఒక క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు, వెహికిల్ యొక్క చాసిస్ నంబర్ లేదా ఇంజిన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ డీటెయిల్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఇప్పుడు తదుపరి పేజీ పైన, మీ వెహికిల్ పై ఏదైనా చలాన్ ఉంటే మీకు తెలుస్తుంది. దీంతో పాటు, మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లేదా చలాన్ నంబర్ ఎంటర్ చేసి కూడా చలాన్ ని చెక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయండి
మీ వెహికిల్ పై చలాన్ గానీ ఉంటే, దాన్ని మీరు ఆన్‌లైన్ ద్వారా కట్టవచ్చు. చలాన్ వివరాలతో పాటు Pay Now (పే నౌ) అనే బటన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ కోసం, మీరు క్రెడిట్, డెబిట్ లేదా యూపీఐ సాయం తీసుకోవచ్చు. ఇది కూడా చదవండి: గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా?
చలాన్ ని చెక్ చేయడం, పేమెంట్ చేయడం వంటి విషయాలను గురించి తెలుసుకున్నారు కదా. మరొకసారి చదవండి. అలాగే పైన పేర్కొనబడిన స్టెప్స్ ని ఫాలో అయి చలాన్లను చెక్ చేయండి. ఏమైనా చలాన్ పెండింగ్ ఉంటే పేమెంట్ చేసేయండి.