లాంచైన భారతదేశపు వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ Ultraviolette F77

హైలైట్స్

  • ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ తో వచ్చిన బెంగళూరు స్టార్టప్ అల్ట్రావయొలెట్
  • 307 కిలోమీటర్ల రేంజ్ కలిగిన Ultraviolette F77 ఈ-బైక్
  • షాడో, లైట్నింగ్, లేజర్ అనే మూడు వేరియంట్స్ లో లభించనున్న బైక్

భారతదేశంలో ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా నడుస్తోంది. సంప్రదాయ ఇంధనం ధరలు పెరిగిపోతుండటంతో, ఈవీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. జనాలు ఈవీ ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నారు. అడపాదడపా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా అవేవీ జనాలను ఈవీలకు దూరం చేయడం లేదు. బ్యాటరీలు నిప్పంటుకోకుండా కంపెనీలు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పుడు దాదాపుగా రోజుకో కొత్త ఎలక్ట్రిక్ బండి మార్కెట్ లో అడుగు పెడుతోంది. బెంగళూరుకి చెందిన స్టార్టప్ Ultraviolette ఓ విద్యుత్ ద్విచక్రవాహనాన్ని లాంచ్ చేసింది.

Ultraviolette F77 పేరుతో వచ్చిన ఎలక్ట్రిక్ బైక్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ 307 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ బండి లభించనుంది. అవి: షాడో, లైట్నింగ్ మరియు లేజర్. ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ బైక్స్ కంటే దీని ధరే ఎక్కువ. మరి భారతదేశపు ఫాస్టెస్ట్ బ్యాటరీ బైక్ కి సంబంధించిన ఫీచర్లు, ధర, బుకింగ్, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Ultraviolette F77 డిజైన్

Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్ ఏరోడైనమిక్ డిజైన్ ని కలిగి ఉంది. స్లీక్ హెడ్‌ల్యాంప్స్, బైక్ రెండు పక్కలా ఫైబర్ తో కప్పబడి ఉంది. ఇక అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్స్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బండి మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Ultraviolette F77 ధర మరియు బుకింగ్

రూ.3.8 లక్షల ప్రారంభ ధరతో కంపెనీ Ultraviolette F77 బైక్ ని పరిచయం చేసింది. ఇది Ultraviolette F77 Original వేరియంట్ ధర. ఇక Ultraviolette F77 Recon వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.55 లక్షలుగా ఉంది. ఈ రెకాన్ వేరియంట్ 307 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ ని కూడా Ultraviolette కంపెనీ తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర రూ.5.5 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించారు. అక్టోబర్ 23 నుంచి ఈ బండి బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పుడు కూడా రూ.10,000 చెల్లించి ఈ బండిని బుక్ చేసుకోవచ్చు.

Ultraviolette F77 ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్

Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్ 38.8 bhp, 95 Nm పీక్ టార్క్ ని కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 147 kmph గా ఉంది. గ్లైడ్, కాంబ్యాట్, బాలిస్టిక్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. సింగిల్ చార్జ్ పై ఈ బైక్ 307 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది.

Ultraviolette F77 బైక్ ని రెండు రకాల చార్జర్లతో చార్జింగ్ చేయవచ్చు. స్టాండర్డ్ చార్జర్ ఉపయోగిస్తే 35km/hour చొప్పున చార్జ్ అవుతుంది. ఇక బూస్ట్ చార్జర్ ఉపయోగిస్తే, 75km/hour చొప్పున బైక్ చార్జ్ అవుతుంది. అంటే మీరు గంట సేపు బండిని చార్జ్ చేస్తే అది దాదాపుగా 35 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.