హైలైట్స్:
- బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన Unstoppable చాట్ షో
- ఆహా ఓటీటీ లో ప్రసారమైన సీజన్-1, సీజన్-2 కోసం ప్రేక్షకుల ఎదురు చూపు
- ఊహించని సర్‌ప్రైజెస్ తో వస్తున్న Unstoppable సీజన్-2
Unstoppable Season-2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ చాట్ షో Unstoppable సీజన్-1 భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. AHA ఓటీటీ లో ఈ ప్రోగ్రామ్ ప్రసారమైంది. ఎంతోమంది సినీ దిగ్గజాలు ఈ షోకి అతిథులుగా విచ్చేశారు. బాలయ్య వ్యాఖ్యానం షో కి ప్రధాన బలంగా నిలిచింది. వచ్చిన గెస్ట్ లకు తనదైన శైలిలో ప్రశ్నలను సంధించారు బాలయ్య. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా ఫన్ క్రియేట్ చేస్తూ నవ్వులు పూయించారు. దీంతో Unstoppable షో ఇటు యూత్ ని అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది.
ఇప్పుడు అందరూ Unstoppable సీజన్-2 కోసం వేచి చూస్తున్నారు. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అనే క్యాప్షన్ తో సీజన్-2 వస్తోంది. తాజాగా సీజన్ 2 కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
Unstoppable-2: ఊహించని సర్‌ప్రైజెస్ గ్యారంటీ
ఈసారి Unstoppable-2 లో ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తే సర్‌ప్రైజెస్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సీజన్ 2 లో గెస్ట్ గా ఎంట్రీ ఇస్తారని సమాచారం. అసలైతే, మెగాస్టార్ మొదటి సీజన్ లోనే ఈ చాట్ షోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్లన ఆయన రాలేకపోయారు. ఈసారి తప్పకుండా వస్తారని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్, చిరంజీవి కలిసి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గెస్ట్ గా వస్తారని చెబుతున్నారు. యంగ్ టైగర్ తో పాటు బాలయ్యని ఒకే వేదికపై చూడాలని నందమూరి అభిమానులతో పాటు, యావత్ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఈ సీజన్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని ఆశిద్దాం. నాగార్జున, వెంకటేశ్ కూడా ఈ చాట్ షో కి వస్తారని సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహారాజా రవితేజ గత సీజన్ లో అన్‌స్టాపబుల్ షో కి వచ్చి సందడి చేశారు. ఈసారి కూడా బిగ్ సెలబ్రిటీలతో షో కి కళ వస్తుందని అందరు అంచనా వేస్తున్నారు.
Unstoppable-2 స్ట్రీమింగ్ తేదీ
ఈ దసరా పండుగ కానుకగా సీజన్-2 మొదటి ఎపిసోడ్ ని ప్రసారం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లేదంటే అక్టోబర్ మొదటి రెండు వారాల్లో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుందని సమాచారం. త్వరలోనే Unstoppable సీజన్-2 కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఆహా నుంచి వచ్చే అవకాశం ఉంది. మరోసారి బాలయ్యను హోస్ట్ అవతారంలో చూడాలి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
లేటెస్ట్ ఎంటర్టెయిన్మెంట్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.