ఆగస్టు నెల చివరికి వచ్చింది. ఈ నెలలో పలు స్మార్ట్‌ఫోన్లను యూజర్లను పలకరించాయి. ఇప్పుడు రాబోయే కొత్త నెల సెప్టెంబర్ పై అందరి చూపు ఉంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఆపిల్ సహా మరెన్నో బ్రాండ్స్ ఉన్నాయి. Apple విషయానికి వస్తే, తన iPhone 16 సిరీస్ ను వచ్చే నెల లాంచ్ చేయబోతోంది. మరి, సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోయే ఫోన్ల జాబితాను తెలుసుకుందామా?
సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు
Infinix Hot 50 5G
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో సెప్టెంబర్ 5వ తేదీన లాంచ్ అవుతోంది. దీని ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా. సెగ్మెంట్ లో అత్యంత సన్నని 5జీ ఫోన్ ఇదేనని ఇన్ఫినిక్స్ కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి.
iPhone 16 / 16 Plus
iPhone 16 సిరీస్ సెప్టెంబర్ 9న లాంచ్ అవుతోంది. లైనప్ లో ఏయే ఫోన్లు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. అయితే 4 ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. బేస్ వేరియంట్ iPhone 16 ధర రూ.79,999, iPhone 16 ప్లస్ ధర రూ.89,999 గా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లలో బయోనిక్ ఏ18 చిప్ ఉంటుంది. ఈ ఫోన్లు వరుసగా 6.1-ఇంచ్ మరియు 6.7-ఇంచ్ డిస్ప్లేస్ తో రానున్నాయి.
iPhone 16 Pro / 16 Pro Max
iPhone 16 Pro, iPhone 16 Pro Max కూడా సెప్టెంబర్ 9న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iPhone 16 Pro ధర రూ.1,19,900, iPhone 16 Pro Max ధర రూ.1,49,900 గా ఉంటాయని సమాచారం. ఈ ఫోన్లలో బయోనిక్ ఏ18 ప్రో చిప్ ఉంటుంది. ఇంకా 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, టైటానియమ్ డిజైన్ ఉంటాయి. ప్రో వేరియంట్ లో 6.3-ఇంచ్ డిస్ప్లే, ప్రో మ్యాక్స్ లో 6.9-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది.
Motorola Razr 50
Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. త్వరలో తేదీ వెల్లడవుతుంది. ఈ ఫోన్ ధర రూ.65,000 గా ఉంటుందని అంచనా. ఈ ఫోన్ 3.6-ఇంచ్ ఎక్స్‌టర్నల్ డిస్ప్లేతో వస్తోంది.
Realme Narzo 70 Turbo 5G
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌పోన్ భారత్‌లో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇప్పటికే ఈ ఫోన్ రియల్మీ అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది.
Realme P2 / Realme P2 Pro
రియల్మీ సంస్థ త్వరలో రియల్మీ పీ2 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme P2 మరియు Realme P2 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. Realme P2 ధర రూ.15,999, Realme P2 Pro ధర రూ.19,499 ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లు సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అవుతాయని తెలుస్తోంది. ఈ ఫోన్లు 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావొచ్చు.
Vivo T3 Ultra
Vivo T3 Ultra సెప్టెంబర్ నెలాఖరులో లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఓఐఎస్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే కచ్చితమైన తేదీ వివరాలు వెల్లడవుతాయి.

![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








