గేమ్స్ ఆడాలని ఎక్కువగా ఇష్టపడే వారికి ఒక చక్కటి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇక రూ.15,000 బడ్జెట్ అనేది డీసెంట్ గేమింగ్ అనుభూతిని అందించే సెగ్మెంట్ గా ఉంది. మోస్తరు బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనాలని అనుకునే వారికి రూ.15,000 లోపు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్ల జాబితాను 91mobiles టీమ్ కొన్ని టెస్టులు జరిపి తయారు చేసింది. ఓసారి ఆ లిస్ట్ తెలుసుకుందాం.
రూ.15,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు
| స్మార్ట్‌ఫోన్ | లాంచ్ తేదీ | ధర |
| ఐకూ జెడ్9ఎక్స్ | మే 16, 2024 | రూ.12,999 |
| వివో టీ3ఎక్స్ | ఏప్రిల్ 17, 2024 | రూ.13,499 |
| మోటో జీ64 | ఏప్రిల్ 16, 2024 | రూ.14,999 |
| మోటో జీ45 | ఆగస్టు 21, 2024 | రూ.10,999 |
| రెడ్మీ 13 | జులై 9, 2024 | రూ.13,999 |
iQOO Z9x
iQOO Z9x ప్రారంభ ధర భారత్ లో రూ.12,999 గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఇందులో వాడారు. ఈ డివైజ్ యొక్క అంటుటు, గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్స్ సెగ్మెంట్ బెస్ట్ గా ఉన్నాయి. క్యాజువల్ గేమింగ్‌ను ఈ ఫోన్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఈ ఫోన్ లో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ గేమ్‌లను హై అండ్ హెచ్డీ రెజుల్యూషన్స్ లో ఆడవచ్చు.
| బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ | హెచ్డీ |
| బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ | 40 |
| గేమింగ్‌కు ముందు టెంపరేచర్ | 30.9 |
| గేమింగ్ తర్వాత టెంపరేచర్ | 36.2 |
| బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ | 5 శాతం |
Vivo T3x
Vivo T3x స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. ధర రూ.13,999. ఈ ఫోన్ యొక్క అంటుటు స్కోరు 5,49,494 గా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 940 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2767 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఫోన్ బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 లాంటి గేమ్‌లను స్మూథ్ గా హ్యాండిల్ చేస్తుంది. అయితే మినిమల్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి. ఓవర్ హీటింగ్ మాత్రం లేదు.
| బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ | హెచ్డీ |
| బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ | 60 |
| గేమింగ్‌కు ముందు టెంపరేచర్ | 29.3 |
| గేమింగ్ తర్వాత టెంపరేచర్ | 33.3 |
| బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ | 6 శాతం |
30 నిమిషాల పాటు ఈ ఫోన్ లో గేమ్ ఆడగా, టెంపరేచర్ 29.3 డిగ్రీల నుంచి 33.3 డిగ్రీలకు పెరిగింది. బ్యాటరీ 6 శాతం ఖర్చయ్యింది. ఓవరాల్ గా వివో టీ3ఎక్స్ డీసెంట్ టెంపరేచర్‌తో, తక్కువ బ్యాటరీని ఖర్చు చేసింది.
Moto G64
Moto G64 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. గీక్‌బెంచ్ మరియు అంటుటు ప్లాట్ఫామ్స్ పై డీసెంట్ గా స్కోర్ చేసింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను ఈ ఫోన్ పర్వాలేదనిపించేలా హ్యాండిల్ చేసింది. అయితే గొప్పగా మాత్రం లేదని చెప్పవచ్చు.
| బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ | హెచ్డీ |
| బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ | 60 |
| గేమింగ్‌కు ముందు టెంపరేచర్ | 31.1 |
| గేమింగ్ తర్వాత టెంపరేచర్ | 36.4 |
| బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ | 6 శాతం |
మోటో జీ64 స్మార్ట్‌ఫోన్‌లో 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక టెంపరేచర్ 31.1 డిగ్రీల నుంచి 36.4 డిగ్రీలకు పెరిగింది. బ్యాటరీ 6 శాతం ఖర్చయ్యింది. ఓవరాల్‌గా ఈ ఫోన్ టెంపరేచర్‌ను బాగానే మెంటైన్ చేసింది. అలాగే తక్కువ బ్యాటరీని వాడుకుంది.
Moto G45
Moto G45 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ అందించారు. అంటుటు స్కోర్ 4,49,055 గా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 929 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2,159 పాయింట్లు స్కోర్ చేసింది. స్మూథ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మోటో జీ45 లో పొందవచ్చు.
| బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ | హెచ్డీ |
| బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ | అల్ట్రా |
| గేమింగ్‌కు ముందు టెంపరేచర్ | 29.1 |
| గేమింగ్ తర్వాత టెంపరేచర్ | 31.6 |
| బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ | 7 శాతం |
టెస్టింగ్ సమయంలో, మోటో జీ45 యొక్క టెంపరేచర్ 29.1 డిగ్రీల నుంచి 31.6 డిగ్రీల వరకు పెరిగింది. బ్యాటరీ 7 శాతం ఖర్చయ్యింది. ఓవరాల్‌గా ఈ ఫోన్ టెంపరేచర్‌ను బాగానే హ్యాండిల్ చేసింది. అలాగే గేమింగ్ టైమ్ లో బ్యాటరీ వాడకం కూడా రీజనబుల్‌గా ఉంది.
Redmi 13
Redmi 13 స్మార్ట్‌ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ అందించారు. ఈ ఫోన్ ధర రూ.13,999 గా ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. గీక్‌బెంచ్ 6 మరియు అంటుటు ప్లాట్ఫామ్స్ పై స్కోర్లు బాగానే ఉన్నాయి. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ గేమ్‌లు బాగానే హ్యాండిల్ చేయగలదు.
| బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ | హెచ్డీ |
| బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ | హై |
| గేమింగ్‌కు ముందు టెంపరేచర్ | 29.7 |
| గేమింగ్ తర్వాత టెంపరేచర్ | 37.8 |
| బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ | 8 శాతం |
రెడ్మీ 13 లో 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, టెంపరేచర్ 29.7 డిగ్రీల నుంచి 37.8 డిగ్రీలకు పెరిగింది. బ్యాటరీ 8 శాతం ఖర్చయ్యింది. గేమింగ్ తర్వాత, టెంపరేచర్ మరియు బ్యాటరీ డ్రాప్ అనేవి కాస్త కంగారు పెట్టేలా ఉన్నాయి.

![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








