హైలైట్స్:
- ఆగస్టు 25 న ప్రపంచ వ్యాప్తంగా 3000 లకు పైగా థియేటర్లలో విడుదలైన లైగర్
- ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ, కథానాయికగా చేసిన అనన్యా పాండే, కీలక పాత్ర పోషించిన రమ్యకృష్ణ, స్పెషల్ రోల్ లో కనిపించిన మైక్ టైసన్
- లైగర్ ఓటీటీ హక్కులను భారీ ధరకు కైవసం చేసుకున్న డిస్నీ+ హాట్‌స్టార్, త్వరలోనే ప్రీమియర్ తేదీ ప్రకటన
Liger OTT Update: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ లైగర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 3000 లకు పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలవ్వడం విశేషం. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+ హాట్‌స్టార్ ఈ చిత్ర హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ప్రీమియర్ తేదీని ఇంకా వెల్లడించలేదు. థియేటర్లో లైగర్ ప్రదర్శనను బట్టి, ఓటీటీ ప్రీమియర్ తేదీ నిర్ణయించబడుతుంది. థియేటర్ కి వెళ్ళి చూడలేని వారు త్వరలో డిస్నీ+ హాట్ స్టార్ లో లైగర్ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.
Liger చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం
లైగర్ చిత్ర కథ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో ఎంఎంఏ ఫైటర్ గా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించాడు. విజయ్ కి జోడీగా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటించింది. ఇక విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. రోనిత్ రాయ్, విషురెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు.
లైగర్ చిత్రానికి సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చి, జానీ, లిజో జార్జ్, డీజే చేతస్ సంగీతం అందించారు. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పని చేశాడు. జునైద్ సిద్దిఖీ ఎడిటర్ గా పని చేశాడు. పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
చిత్ర కథ
ఎంఎంఏ లో నేషనల్ ఛాంపియన్ కావాలని కల కనే లైగర్ (విజయ్ దేవరకొండ), తన తల్లి బాలమణి (రమ్యకృష్ణ) తో కలిసి కరీంనగర్ నుంచి ముంబై చేరుకుంటాడు. తర్వాత కొన్ని పరిణామాల అనంతరం లైగర్, తాన్య (అనన్యా పాండే) తో ప్రేమలో పడతాడు. తన కలను నెరవేర్చుకునేందుకు లైగర్ ఏం చేశాడు? మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో నేషనల్ ఛాంపియన్ అవుతాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విజయ్ దేవరకొండ తన పాత్రకు న్యాయం చేశాడు. అనన్యా పాండే పర్వాలేదనిపించింది. గెటప్ శ్రీను తన కామెడీతో నవ్వులు పూయించాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ బాగానే చేశారు. విజయ్ దేవరకొండ హై ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ సినిమాకు ప్రధాన బలం. లైగర్ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ వెంచర్ గా నిలిచింది. లాంగ్ రన్ లో వచ్చే వసూళ్ళను బట్టి లైగర్ హిట్టా కాదా అనేది తేలుతుంది.
లేటెస్ట్ ఓటీటీ, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.