హైలైట్స్:
- జులై 20, మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్న వివో టీ1ఎక్స్
- నీలం, నలుపు రంగు ఆప్షన్స్ తో వస్తున్న వివో టీ1ఎక్స్
- వివో అధికార వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్
భారత్ లో తన తదుపరి టీ-సిరీస్ ఫోన్ టీ1ఎక్స్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో సిద్ధమవుతోంది. టీ1ఎక్స్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు వివో కంపెనీ ఇటీవలె టీజ్ చేసింది. తాజాగా, సదరు కంపెనీ వివో టీ1ఎక్స్, కలర్ ఆప్షన్స్, లభ్యత, డిజైన్ వంటి విషయాలను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. వివో వెబ్ సైట్ లో వివో టీ1ఎక్స్ యొక్క మైక్రో సైట్ ని ప్రస్తుతం మనం గమనించవచ్చు. వివో టీ-సిరీస్ లో వస్తోన్న మూడో ఫోన్ వివో టీ1ఎక్స్. ఇది వరకు టీ-సిరీస్ లో వివో టీ1 (4జీ, 5జీ), వివో టీ1 ప్రో అనే రెండు ఫోన్స్ వచ్చాయి. మరి వివో టీ1ఎక్స్ ప్రత్యేకతలేంటో ఇక్కడ చూద్దాం పదండి.
Vivo T1x ఇండియా లాంచ్, లభ్యత
వివో టీ1ఎక్స్ భారత్ లో జులై 20 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. వివో అధికార వెబ్ సైట్ తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. వివో టీ1ఎక్స్ నలుపు మరియు నీలం రంగు ఆప్షన్స్ లో వస్తోంది.
Vivo T1x డిజైన్
వివో టీ1ఎక్స్ డిజైన్ ఫ్లాట్ గా, బాక్సీ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, రెక్ట్యాంగులర్ ఐలాండ్ లో పైన ఎడమ వైపు కార్నర్ లో ఉంది. ఇక వివో బ్రాండింగ్ క్రింద ఎడమ వైపు కార్నర్ లో కనిపిస్తోంది. ఫోన్ కి పై భాగాన సిమ్ ట్రే, మైక్రోఫోన్ కటౌట్ ఉన్నాయి.
Vivo T1x స్పెసిఫికేషన్స్
లీక్ ద్వారా వివో టీ1ఎక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇలా ఉండనున్నాయని తెలుస్తోంది. అవేంటో ఇక్కడ చూద్దాం పదండి. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ వంటి ఫీచర్లు వివో టీ1ఎక్స్ లో ఉండనున్నాయి.
మరి కెమెరా విభాగంలో ఎటువంటి లెన్స్ లు ఉన్నాయో చూద్దాం రండి. వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ వెనుక వైపున 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి షూటర్ ఉంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, వివో టీ1ఎక్స్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.