హైలైట్స్:
- చైనాలో లాంచ్ అయిన Vivo Y02s స్మార్ట్ ఫోన్
- త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo Y02s
- 3జిబి ర్యామ్, 6.51 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

Vivo Y02s లాంచ్: వివో కంపెనీ తన కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y02s ని చైనాలో లాంచ్ చేసింది. దీంతో వివో తన వై-సిరీస్ ఫోన్లను మరింత పెంచినట్లైంది. తొలుత ఈ ఫోన్ ని చైనా మార్కెట్ లో విడుదల చేసిన వివో, రానున్న రోజుల్లో భారత్ లో లాంచ్ చేయనుంది. Vivo Y02s స్మార్ట్ ఫోన్ లో 3జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
Vivo Y02s స్పెసిఫికేషన్స్
Vivo Y02s లో 6.51 అంగుళాల హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేను అమర్చారు. ఇది 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్లో ఉంది. 2.5డీ కవర్వ్డ్ గ్లాస్ తో ఫోన్ కి రక్షణ కల్పించారు. ఫోన్ డైమెన్షన్స్ చూస్తే.. 163.95 ఎంఎం పొడవు, 75.55 ఎంఎం వెడల్పు, 8.19 మందం వంటి కొలతలతో ఉంది. ఇక ఫోన్ బరువు 182 గ్రాములు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో Vivo Y02s లాంచ్ అయ్యింది. అలాగే ఇది ఫన్ టచ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇక ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ ని అమర్చారు. Vivo Y02s 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని కలిగి ఉంది. ఇప్పుడు ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo Y02s లో వెనకాల 8ఎంపి కెమెరాతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు Vivo Y02s లో 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
Vivo Y02s స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్లో 4జీ కనెక్టివిటీ ఉంది. ఈ ఫోన్లో 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo Y02s లో వెనకాల 8ఎంపి కెమెరాతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు Vivo Y02s లో 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
Vivo Y02s ధర
Vivo Y02s సింగిల్ వేరియంట్ (3జిబి+32జిబి) లో మాత్రమే చైనాలో లాంచ్ అయ్యింది. ఈ లో-బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర 906 యువాన్లు గా ఉంది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఇది దాదాపు రూ.10,600 గా ఉంటుంది. చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ సఫైర్ బ్లూ, షైన్ బ్లాక్ అనే రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. భారతదేశంలో ఈ ఫోన్ ధరలో మార్పు ఉండే అవకాశముంది.













