ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో ఒక కొత్త ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. Vivo Pad3 Pro పేరుతో ఈ ట్యాబ్లెట్ మార్కెట్ లోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ల మాదిరే ఈ ట్యాబ్లెట్ లో మంచి పవర్, ఉత్తమమైన డిజైన్ ఉన్నాయి. 12.95-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 13ఎంపి రియర్ కెమెరా, 512జిబి వరకు స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ట్యాబ్లెట్ ఆఫర్ చేస్తోంది. సరే, ఓసారి Vivo Pad3 Pro ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo Pad3 Pro ధర
Vivo Pad3 Pro ట్యాబ్లెట్ చైనాలో 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
Vivo Pad3 Pro ధర 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 2,999 (సుమారు రూ.34,610) గా ఉంది.
Vivo Pad3 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 3,299 (సుమారు రూ.38,100) గా ఉంది.
Vivo Pad3 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 3,599 (సుమారు రూ.42,200) గా ఉంది.
Vivo Pad3 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 3,999 (సుమారు రూ.46,150) గా ఉంది.
Vivo Pad3 Pro ట్యాబ్లెట్ స్ప్రింగ్ బ్లూ, గ్రే మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo Pad3 Pro కోసం పెన్సిల్ 2 లను RMB 499 (సుమారు రూ.5,800) కి కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ టచ్ కీబోర్డ్ ని RMB 599 (సుమారు రూ.7,100) కి సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 3 నుంచి Vivo Pad3 Pro సేల్ కి అందుబాటులో ఉంటుంది.
Vivo Pad3 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Pad3 Pro లో 12.95-ఇంచ్ 3.1కే ఎల్సీడీ డిస్ప్లే, 3096*2064 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10, 900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Pad3 Pro లో MediaTek Dimensity 9300 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం Immortalis-G720 GPU వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Pad3 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ + 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Vivo Pad3 Pro లో 13ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
- బ్యాటరీ: Vivo Pad3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 11,500mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo Pad3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Pad3 Pro లో 8 స్పీకర్లు, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, 5జీ, 4జీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
