ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించింది. Vivo Y27, Vivo Y17s 64GB, Vivo Y17s 128GB ఫోన్ల ధర తగ్గింది. ఈ ఫోన్లు ఇప్పటికే తక్కువ ధరకి అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు మరింత ధర తగ్గడం యూజర్లకు శుభవార్తేనని చెప్పాలి. మరి ఈ మోడల్ ధర ఏమేరకు తగ్గిందో ఓసారి తెలుసుకుందాం పదండి.
Vivo Y27 ధర
Vivo Y27 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర రూ.1,000 తగ్గింది. ఈ ఫోన్ ఇదివరకు రూ.11,999 ధరకి అమ్ముడైంది. ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు దీన్ని రూ.10,999 కి కొనుగోలు చేయవచ్చు. వివో వై27 బర్గండీ బ్లాక్ మరియు గార్డెన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది.
Vivo Y17s ధర
Vivo Y17s స్మార్ట్‌ఫోర్ రెండు మొమరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. రూ.1,000 ధర తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.9,499 కి లభించనుంది.
Vivo Y17s 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.11,499 గా ఉంది. ఇప్పుడు రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.10,499 కి లభించనుంది.
Vivo Y27 స్పెసిఫికేషన్స్
Vivo Y27 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Vivo Y17s స్పెసిఫికేషన్స్
Vivo Y17s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
