Home News 66వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12+8జిబి ర్యామ్, కర్వ్డ్‌ డిస్ప్లేతో లాంచైన Vivo S16 Pro

66వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12+8జిబి ర్యామ్, కర్వ్డ్‌ డిస్ప్లేతో లాంచైన Vivo S16 Pro

హైలైట్స్

చైనాలో Vivo S16 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో Vivo S16 Pro, Vivo S16, Vivo S16e ఫోన్లు వచ్చాయి. ఈ మూడు ఫోన్లు 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. టాప్ మోడల్ అయిన Vivo S16 Pro 50ఎంపి సెల్ఫీ కెమెరాతో రావడం విశేషం. అలాగే ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 8జిబి వర్చువర్ ర్యామ్ కలిగి ఉంది. అంటే యూజర్ కి మొత్తం 20 జిబి ర్యామ్ లభిస్తుంది. ఇకపోతే ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, కర్వ్డ్ డిస్ప్లే, 66 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Vivo S16 Pro పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo S16 Pro ధర

Vivo S16 Pro రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర CNY 3299 (రూ.39,100), 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ధర CNY 3599 (రూ.42,700) గా ఉంది.

Vivo S16 Pro స్పెసిఫికేషన్స్

Vivo S16 Pro 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1.07 బిలియన్ కలర్స్, పీ3 కలర్ గేముత్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo S16 Pro లో 5జీ కనెక్టివిటీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అమర్చారు. ఇది 4 నానోమీటర్ టెక్నీలజీ పై తయారైన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెన్ మాలి జీ610 జీపీయూ వాడారు. ఈ ఫోన్ మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. అంటే ర్యామ్ ని 8జిబి వరకు పెంచుకోవచ్చు. దీంతో యూజర్ కి 12జిబి+8జిబి ర్యామ్ కలిపి మొత్తం 20జిబి ర్యామ్ లభిస్తుంది.

Vivo S16 Pro కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి ప్రైమరీ సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Vivo S16 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.