Home News 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్

50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్

Highlights
  • చైనాలో లాంచైన Vivo S17 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo S17, Vivo S17t, Vivo S17 Pro
  • 5జీ కనెక్టివిటీతో వచ్చిన డివైజెస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Vivo S17, Vivo S17t, Vivo S17 Pro. ఈ ఫోన్లు స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. నేడు జరిగిన ఈవెంట్ లో కంపెనీ మూడు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అయితే Vivo S17, Vivo S17 Pro మోడల్స్ ధరలను మాత్రమే వెల్లడించింది. సరే, ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S17 సిరీస్ ఫోన్ల ధరలు

Vivo S17 ధర

Vivo S17 Pro ధర

Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్

Vivo S17 Pro

డిస్ప్లే

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

చిప్సెట్

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 3.1 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 జీపీయూ వాడారు. Vivo S17 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17

డిస్ప్లే

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ఓఎస్

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ

Vivo S17 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17t

Vivo S17t స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన దాదాపు అన్ని స్పెసిఫికేషన్స్ బేస్ మోడల్ Vivo S17 ని పోలి ఉన్నాయి. కంపెనీ కేవలం చిప్సెట్ ని మార్చి Vivo S17t ని మార్కెట్ లోకి వదిలింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో వచ్చింది. మాలి-జీ77 జీపీయూ గ్రాఫిక్స్ ని ఇందులో వాడారు. అయితే Vivo S17t ధరను వివో ఇంకా వెల్లడించలేదు.