ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo S17 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా వస్తోన్న Vivo S17t డివైజ్ తాజాగా TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో Vivo S17t పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 1.5కే+ రెజుల్యూషన్, 6.74-ఇంచ్ స్క్రీన్, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ తో వస్తోంది.
తాజాగా Vivo S17t స్మార్ట్ ఫోన్ TENAA వెబ్ సైట్ పై కనిపించడంతో పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo S17t డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయిన Vivo S17t చిప్సెట్ వివరాలు
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Vivo S17t డివైజ్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో రానున్నట్లు సదరు టిప్‌స్టర్ తెలిపారు. ప్రైస్ బాబా వెబ్ సైట్ కూడా తన కథనంలో ఈ చిప్సెట్ ని పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు Vivo S17 మోడల్ మాదిరే ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే వివో ఎస్17టి స్పెసిఫికేషన్స్ కి సంబంధించి సంస్థ నుంచి అధికార సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అప్పుడు స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పై పూర్తి క్లారిటీ వస్తుంది. ఈలోపు Vivo S17t కి సంబంధించిన అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo S17t స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే
- 6.74-ఇంచ్ స్క్రీన్
- 1.5కే+ అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Vivo S17t స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.
చిప్సెట్, స్టోరేజీ
- డైమెన్సిటీ 8050
- ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
- యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ
Vivo S17t స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉండవచ్చు.
కెమెరా విభాగం
- డ్యూయల్ కెమెరా
- సోని ఐఎంఎక్స్766వి
- సోని ఐఎంఎక్స్355
Vivo S17t డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
బ్యాటరీ, చార్జింగ్
- 4600 ఎంఏహెచ్
- 80 వాట్ చార్జింగ్
Vivo S17t స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించనున్నారు.
