ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo S18 మరియు Vivo S18 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్లు చైనీస్ మార్కెట్ లో డిసెంబర్ 14 న విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ల యొక్క కలర్ ఆప్షన్స్ ని కంపెనీ టీజ్ చేసింది. ఇప్పుడు Vivo S18 సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo S18, Vivo S18 Pro కెమెరా వివరాలు
- Vivo S18, Vivo S18 Pro ఫోన్లు 50ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్నాయని వివో కంపెనీ వెల్లడించింది.
- చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో పై షేర్ చేయబడిన టీజర్ ప్రకారం, Vivo X100 మోడల్ లో కనిపించే ప్రైమరీ, అల్ట్రావైడ్ సెన్సర్స్ Vivo S18 సిరీస్ లో ఉంటాయని తెలుస్తోంది.
- Vivo S18 Pro లో 50ఎంపి వీసీఎస్ సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. Vivo X90S లో ఉన్నటువంటి టెలీఫోటో లెన్స్ Vivo S18 Pro లో ఉంటుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో 12ఎంపి సోని ఐఎంఎక్స్663 2x లెన్స్ ఉంటుంది.
- వీసీఎస్, పొట్రెయిట్ ఆల్గారిథమ్స్ తో పాటు ఫోటోగ్రఫీని మెరుగుపరిచేందుకు Vivo X100 సిరీస్ స్మార్ట్ఫోన్లలో ఉపయోగించిన బ్లూ హార్ట్ ఏఐ మోడల్ ని Vivo S18 Pro లో అందిస్తున్నారు.
Vivo S18, Vivo S18 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo S18 మరియు Vivo S18 Pro డివైజెస్ లో కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: Vivo S18 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. మరోవైపు Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుంది.
- చార్జింగ్: Vivo S18 డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. మరోవైపు Vivo S18 Pro 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
Vivo S18 కలర్ ఆప్షన్స్
Vivo S18 యొక్క కొత్త ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇది లైట్ బ్లూ మరియు డార్క్ గ్రే కలర్స్ లో కనిపిస్తోంది. ఇకపోతే, Vivo S18 డివైజ్ హుయాక్సియా రెడ్, బ్లాక్, పర్పుల్, సీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో రానుందని అంచనా వేస్తున్నారు.
