Home News Vivo S18 ట్రిపుల్-కెమెరా సెటప్‌ని టీజ్ చేసిన వివో

Vivo S18 ట్రిపుల్-కెమెరా సెటప్‌ని టీజ్ చేసిన వివో

Highlights
  • 50ఎంపి ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తోన్న Vivo S18
  • డిసెంబర్ 4 న Vivo S18 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం
  • లైనప్ లో వస్తోన్న Vivo S18, Vivo S18 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో Vivo S18, Vivo S18 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. చైనీస్ టిప్‌స్టర్ WhyLab నిన్న చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై Vivo S18 సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది. ఇప్పుడు అఫీషియల్ లాంచ్ కి ముందు వివో ప్రొడక్ట్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ Ouyang Weifeng వీబో పై టీజర్ ఇమేజ్ ని షేర్ చేశారు. దీంతో Vivo S18 స్మార్ట్‌ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది.

Snapdragon 7 Gen 3 చిప్‌తో రానున్న Vivo S18

Vivo S18 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, టెలీఫోటో లెన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Vivo S18 Pro వై-ఫై 7 కనెక్టివిటీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం, Vivo S18 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. డిసెంబర్ 4 వ తేదీన Vivo S18 సిరీస్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.