హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన వివో టీ1ఎక్స్
- 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జీ నెట్వర్క్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు
- భారత్ లో వివో టీ1ఎక్స్ ధర రూ.11,999
వివో టీ1ఎక్స్ భారత్ లో లాంచ్ అయ్యింది. వివో నుంచి వస్తున్న అతిపెద్ద బ్యాటరీ కలిగిన టీ-సిరీస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ హ్యాండ్సెట్ వాటర్ డ్రాప్ నాచ్ ని కలిగి ఉంది. ఈ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫ్లాట్ ఎడ్జెస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో డ్యూయల్ రియర్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. 4 లేయర్ (గ్రాఫైట్ కూలింగ్ ప్లేట్, హై హీట్ కండక్టివిటీ కాపర్ కాయిల్, థర్మల్లీ కండక్టివ్ జెల్, కూలింగ్ టర్బో) కూలింగ్ సిస్టమ్ ఈ ఫోన్లో ఉండటం వల్లన గేమ్స్ ఆడేటప్పుడు మల్టీ టర్బో 5.0 నెట్వర్క్ కనెక్షన్ ను ఎన్హాన్స్ చేయడంతోపాటు, ప్రాసెసర్ వేగాన్ని పెంచి, పవర్ ను సేవ్ చేస్తుంది.
6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జీ నెట్వర్క్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ప్రైమరీ సెన్సర్ వంటి కీలకమైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
భారత్ లో Vivo T1x ధర, సేల్ డేట్, లభ్యత
భారత్ లో వివో టీ1ఎక్స్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.11,999, 4జిబి+128జిబి వేరియంట్ ధర రూ.12,999, 6జిబి+128జిబి మోడల్ ధర రూ.14,999. ఇక హ్యాండ్సెట్ గ్రేవిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ మరియు వివో ఈ-స్టోర్ ద్వారా ఈ ఫోన్ జులై 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కు వస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాక్ క్రెడిట్, డెబిట్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
వివో టీ1ఎక్స్ ఫోన్లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 2.5డీ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 రెజుల్యూషన్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్ డ్రాప్ నాచ్, 90.6 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 96 పర్సెంట్ ఎన్టీఎస్సీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, అడ్రెనో 610 జీపీయూ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ 128జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. అలాగే 2 జిబి వరకు ఎక్స్ టెండబుల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
వివో టీ1ఎక్స్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 4 లేయర్ కూలింగ్ సిస్టమ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వివో ఎనర్జీ గార్డియన్ ఫీచర్ (ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ఫోన్ హీట్ అవ్వకుండా చూస్తుంది) ఈ ఫోన్లో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం యొక్క విశేషాలను ఇక్కడ చూద్దాం. వివో టీ1ఎక్స్ లో రెండు వెనుక కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కాగా, మరొకటి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
వివో టీ1ఎక్స్ లో ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. ఈ విషయాన్ని కొనుగోలుదారులు గమనించాలి. అయితే ధర, ఇతర ఫీచర్లను బట్టి, ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పవచ్చు. మిగతా అన్ని విషయాల్లో ఈ ఫోన్ చక్కటి ఫీచ్లను కలిగి ఉంది. కాబట్టి, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు పొందాలనుకునే వారు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయవచ్చు.