వివో సంస్థ భారత్ లో Vivo T2 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.20 వేల బడ్జెట్ లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రీసెంట్ గా లాంచైన OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ కి పోటీ ఇవ్వనుంది. రెండు ఫోన్లు కూడా ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చాయి. ఇక్కడ మీకోసం రెండు ఫోన్ల యొక్క ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లను పోల్చుతున్నాం.
Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర మరియు లాంచ్ ఆఫర్లు
- Vivo T2 5G ప్రారంభ ధర రూ.18,999
- OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ.19,999
రెండు వేరియంట్లో అందుబాటులో ఉన్న Vivo T2 5G. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.18,999. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.20,999.
OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ ని కూడా రెండు వేరియంట్లో కొనుగోలు చేయవచ్చు. 8జిబి ర్యామ్ + 128జిబి బేస్ వేరియంట్ ధర రూ.19,999. 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.
ఏప్రిల్ 18 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా వివో ఫోన్ సేల్ మొదలవుతుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీలపై రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
మరోవైపు వన్‌ప్లస్ ఫోన్ ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే వీలుంది. ఈ ఫోన్ పై కూడా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభించనుంది.
Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్
Vivo T2 5G, OnePlus Nord CE 3 Lite 5G ఫోన్లు దాదాపుగా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉంది. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై రెండు కెమెరా రింగ్స్ ఉంటాయి. వివో ఫోన్ కెమెరా రింగ్ హైలైటెడ్ ప్యానెల్ లో ఉండగా, వన్‌ప్లస్ ఫోన్ ప్యానెల్ ని కలిగి లేదు. వివో ఫోన్ లో ఎల్ఈడీ ఫ్లాష్ మరియు సెకండరీ లెన్స్ కలిసి ఉన్నాయి. వన్‌ప్లస్ డివైజ్ లో ఎల్ఈడీ ఫ్లాష్ వేరుగా ఉంది.
ఈ రెండు వివో మరియు వన్‌ప్లస్ ఫోన్లు ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్స్, ఫ్లాట్ డిజైన్ కలిగి ఉన్నాయి. వివో ఫోన్ లో పవర్ బటన్, వాల్యూమ్ బటన్ కుడివైపున ఉన్నాయి. వన్‌ప్లస్ లో ఎడమవైపున ఉన్నాయి. రెండు ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్ మరియు స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి.
డిస్ప్లే
- అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్
- ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
Vivo T2 డివైజ్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు.
OnePlus Nord CE 3 Lite డివైజ్ లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజీ
వివో టీ2 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619జిబి జీపీయూ అందించారు. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీ పెంచుకోవచ్చు. వన్‌ప్లస్ గురించి చూస్తే ఈ ఫోన్ లో సేమ్ క్వాల్కమ్ ప్రాసెసర్ వాడారు. డివైజ్ 8జిబి ర్యామ్, 128/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి. అయితే వన్‌ప్లస్ డివైజ్ ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో రాగా, వివో మాత్రం ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వచ్చింది.
కెమెరా
వన్‌ప్లస్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో లెన్సెస్ ఉన్నాయి. వివో డివైజ్ లో 64ఎంపి రియర్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ మరియు చార్జింగ్
వివో టీ2 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉణ్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా బాక్స్ లో చార్జర్ తో వస్తున్నాయి.
5జీ సపోర్ట్
రెండు ఫోన్లు కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. వివో ఫోన్ 8 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఏ ఫోన్ బాగుంది?
రెండు ఫోన్లు కూడా చక్కటి ఫీచర్లతో బాగానే ఉన్నాయి. అయితే వివో ఫోన్ కంటే వన్‌ప్లస్ రూ.1000 అధిక ధర కలిగి ఉంది. వివో లో 64ఎంపి కెమెరా ఉండగా, వన్‌ప్లస్ లో 108ఎంపి కెమెరా ఉంది. ఈ సెన్సర్ వన్‌ప్లస్ కి బిగ్ ప్లస్ కానుంది. అలాగే వన్‌ప్లస్ లో 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండగా, వివో లో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే వివో ఫోన్ అమోలెడ్ డిస్ప్లే తో రాగా, వన్‌ప్లస్ మాత్రం ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
