Home News స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో గీక్ బెంచ్ పై కనిపించిన Vivo T2

స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో గీక్ బెంచ్ పై కనిపించిన Vivo T2

Highlights
  • గీక్ బెంచ్ 5 డేటాబేస్ పై కనిపించిన Vivo T2 స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్న డివైజ్
  • Holi అనే కోడ్ నేమ్ తో కనిపించిన ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo T2 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా ఒక ఫోన్ గీక్ బెంచ్ 5 డేటా బేస్ పై కనిపించింది. అది Vivo T2 అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ V2240 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇక Vivo T2 భారత్ లో ఏప్రిల్ 11 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

గీక్ బెంచ్ పై కనిపించిన Vivo T2

గీక్ బెంచ్ 5 డేటాబేస్ పై కనిపిస్తోన్న Vivo T2 చైనీస్ వేరియంట్ కంటే విభిన్నంగా ఉంది. Holi అనే కోడ్ నేమ్ కలిగిన చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడనున్నట్లు సమాచారం. క్వాల్కమ్ సంస్థ స్నాప్ డ్రాగన్ 695 మరియు స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్స్ కి ఇదే కోడ్ నేమ్ ని వాడుతుంది. కాబట్టి రెండింట్లో ఏ చిప్సెట్ ఈ ఫోన్ లో ఉండనుందో కచ్చితంగా చెప్పలేం. అధికార ప్రకటనతో ఈ సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

స్నాప్ డ్రాగన్ 695 మరియు స్నాప్ డ్రాగన్ 480 చిప్సెట్స్ లో ఏవీ కూడా పెద్ద పవర్ఫుల్ కాదు. అయితే స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఏ78 కోర్స్ ని వాడుతుంది. సింగిల్ కోర్ టెస్టింగ్స్ ని బట్టి, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ కలిగిన ఫోన్లు గీక్‌బెంచ్ 5 పై 600-700 పాయింట్లు నమోదు చేస్తాయి. స్నాప్ డ్రాగన్ 480 చిప్సెట్ 500 నుంచి 600 పాయింట్లు స్కోర్ చేస్తుంది. Vivo T2 6జిబి ర్యామ్ తో వస్తోంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండవచ్చు.

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ Vivo T2x, Vivo T2 ఫోన్లు ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హై రిఫ్రెష్ రేట్ ఉంటాయని రివీల్ చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Vivo T2, T2x స్పెసిఫికేషన్స్

ఇవి అంచనా స్పెసిఫికేషన్స్ మాత్రమే. అఫీషియల్ లాంచ్ తర్వాత కచ్చితమైన వివరాలు తెలుస్తాయి. Vivo T2 లో ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6జిబి/8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ తో వస్తాయని అంచనా.

Vivo T2x లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ చవకైన 5జీ ఫోన్ గా నిలవనుంది. ఈ డివైజ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తుందని సమాచారం. రానున్న కొన్ని రోజుల్లో ఈ డివైజెస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.