Vivo ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో T2 5G మరియు T2x 5G స్మార్ట్ఫోన్లను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు T2 సిరీస్‌లో కొత్త ‘ప్రో’ వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చితే, ప్రో వెర్షన్ మరింత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. Vivo T2 5G మరియు T2x 5G రెండూ రూ. 21,000 లోపు ధరను కలిగి ఉన్నాయి. మరి Vivo T2 Pro డివైజ్ ధర ఎంత ఉంటుందో చూడాలి.
అభివృద్ధి దశలో ఉన్న Vivo T2 Pro
- టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం, Vivo T2 సిరీస్ యొక్క ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ AnTuTuలో స్మార్ట్‌ఫోన్ 600,000 స్కోర్ చేసినట్లు సమాాచారం.
- Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO ఇటీవల భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్తో Z7 ప్రోని విడుదల చేసింది. ఇది రూ.23,999తో ప్రారంభమయ్యే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. Vivo T2 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నారు.
- Vivo కొత్త T2 స్మార్ట్‌ఫోన్‌ను 8GB RAM + 128GB మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్లలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
- ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
- లాంచ్ వివరాల విషయానికొస్తే, ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ త్వరలోనే ప్రకటన వస్తుందని మేం భావిస్తున్నాం.
- మేము పైన పేర్కొన్నట్లుగా, ప్రో వేరియంట్ ప్రస్తుత T2 లైనప్ కంటే మెరుగైన స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లతో వస్తుంది. Vivo T2 5G మరియు T2x 5G స్పెసిఫికేషన్స్ పై ఓసారి కన్నేయండి.
Vivo T2 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo T2 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది.
- ప్రాసెసర్: Vivo T2 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo T2 5G డివైజ్ 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Vivo T2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్, ఈఐఎస్ కెమెరా, 2ఎంపి డొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Vivo T2 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: Vivo T2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Vivo T2x 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది.
- ప్రాసెసర్: Vivo T2x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo T2x 5G డివైజ్ 4జిబి + 128జిబి, 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Vivo T2x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ, చార్జింగ్: Vivo T2x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: Vivo T2x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
