Vivo T3 Lite 5G: లీకైన వివో టీ3 లైట్ స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్

Highlights

  • జూన్ 27న Vivo T3 Lite 5G లాంచ్
  • 6.56-ఇంచ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే
  • డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జూన్ 27న ఈ డివైజ్ లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్ మరియు స్పెసిఫికేషన్స్ 91mobiles ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite 5G కలర్ ఆప్షన్స్

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ జూన్ 27వ తేదీన లాంచ్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ విక్రయానికి వస్తోంది. వైబ్రంట్ గ్రీన్ మరియు మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డివైజ్ ధర వివరాలు రివీల్ కానున్నాయి.

Vivo T3 Lite 5G ధర (అంచనా)

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. బేస్ మోడల్ ధర రూ.12,000 కాగా, టాప్ మోడల్ ధర రూ.15,000 ఉండే అవకాశం ఉంది.

Vivo T3 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo T3 Lite 5G లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Lite 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా: Vivo T3 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo T3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి.

బరువు, మందం: Vivo T3 Lite 5G డివైజ్ 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

Previous articleRealme C61 4G: జూన్ 28వ తేదీన భారత్‌లో లాంచ్ కానున్న రియల్మీ సీ61
Next articleMotorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.