Home News Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి

Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి

Highlights
  • నేడు Vivo T3 Pro 5G ఫస్ట్ సేల్
  • 12 గంటలకు సేల్ ప్రారంభం
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Pro 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ యొక్క సేల్ నేడు (సెప్టెంబర్ 3) న మొదలైంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్‌ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ సేల్‌లో భాగంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓసారి Vivo T3 Pro 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G ధర, ఆఫర్లు

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. 8జిబి + 256జిబి మోడల్ ధరు రూ.26,999 గా నిర్ణయించారు.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Vivo T3 Pro 5G సేల్ ప్రారంభమైంది.

Vivo T3 Pro 5G పై లాంచ్ డిస్కౌంట్ కూడా ఉంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ యూజర్లకు రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ తో పాటు, రూ.3,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ శాండ్‌స్టోన్ ఆరెంజ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo T3 Pro 5G బేస్ మోడల్ లాంచ్ ధర రూ.24,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.21,999 కే సొంతం చేసుకోవచ్చు. టాప్ మోడల్ లాంచ్ ధర రూ.26,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.23,999 కే లభిస్తుంది.

Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని అంటుటు స్కోర్ 812119 పాయింట్లుగా ఉంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ సాయంతో 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. రెండేళ్ళు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Vivo T3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, వెట్ టచ్ టెక్నాలజీ, ఐపీ64 ప్రొటెక్షన్ ఉన్నాయి.