ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 27వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో టీ3 ప్రో 5జీ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Vivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 27వ తేదీన లాంచ్ అవుతోంది.
ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదలవుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో మైక్రోసైట్ ద్వారా దర్శనమిస్తోంది.
కొత్త టీజర్ లో Vivo T3 Pro 5G ఆరెంజ్ కలర్ మరియు 3డీ కర్వ్ అమోలెడ్ డిస్ప్లేతో కనిపిస్తోంది.
బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతోన్న iQOO Z9s Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వివో టీ3 ప్రో 5జీ వస్తున్నట్లు తెలుస్తోంది.
Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి మరియు అంచనా)
డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 3డీ కర్వ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్ ఉంటుందని అంచనా.
కెమెరా: Vivo T3 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 సెన్సర్ ఉంటుందని సమాచారం.
బ్యాటరీ: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో ఐపీ64 రేటింగ్ ఉంటుంది. ఇంకా 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
