ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పటికే Vivo T3 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. మార్చిలో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గా Vivo T3 Pro 5G వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Vivo T3 Pro 5G గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు
Vivo T3 Pro 5G డివైజ్ గీక్‌బెంచ్ పై V2404 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. సింగిల్-కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1147 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 3117 పాయింట్లు స్కోర్ చేసింది. మేం జరిపిన టెస్టింగ్ లో Vivo T3 Pro 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1188 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2652 పాయింట్లు స్కోర్ చేసింది.
Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.
Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.
Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: Vivo T3 Pro 5G లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
కెమెరా: Vivo T3 Pro 5G లో 50ఎంపి సోని సెన్సర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బ్యాటరీ: Vivo T3 Pro 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుందని సమాచారం.
