
స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.
Vivo T3 Ultra మరియు Realme GT 6T ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
Vivo T3 Ultra లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Realme GT 6T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. టెస్టు ఫలితాలను తెలుసుకునే ముందు ఈ ఫోన్ల యొక్క ధరలను చూద్దాం.
| ఫోన్ పేరు | ధర |
| వివో టీ3 అల్ట్రా 8జిబి+128జిబి | రూ.31,999 |
| రియల్మీ జీటీ 6టీ 8జిబి+128జిబి | రూ.30,999 |
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్
ఈ టెస్ట్ కోసం మేం రెండు ఫోన్లలో బ్రైట్నెస్ లెవెల్స్ 80 శాతం పెట్టాం. ఈ టెస్ట్ ద్వారా ఒక డివైజ్ సింగిల్ చార్జ్ పై అందించే స్క్రీన్ ఆన్ టైమ్ పై ఒక రఫ్ ఐడియా వస్తుంది.
పీసీమార్క్ బ్యాటరీ టెస్టు ఫలితాను గమనిస్తే, వివో టీ3 అల్ట్రా కంటే రియల్మీ జీటీ 6టీ గంట సేపు ఎక్కువగా నడిచింది. దీన్ని బట్టి, రియల్మీ ఫోన్ కాస్త బెటర్ స్క్రీన్-ఆన్ టైమ్ అందిస్తుందని అర్థమవుతోంది.
| టెస్ట్ | వివో టీ3 అల్ట్రా | రియల్మీ జీటీ 6టీ |
| పీసీమార్క్ స్కోర్ | 12 గంటల 14 నిమిషాలు | 13 గంటల 16 నిమిషాలు |
విజేత: Realme GT 6T
యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్
91మొబైల్స్ టెస్టింగ్ టీమ్ ఈ రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేసి, బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీని తెలుసుకుంది. తక్కువ బ్యాటరీ శక్తిని వాడుకున్న ఫోన్ విజేతగా నిలవనుంది.
| టెస్ట్ | వివో టీ3 అల్ట్రా బ్యాటరీ డ్రాప్ | రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ డ్రాప్ |
| 30 నిమిషాలు యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ | 4 శాతం | 3 శాతం |
ఈ రౌండ్ లో కూడా రియల్మీ జీటీ 6టీ విజేతగా నిలిచింది. వివో టీ3 అల్ట్రా కంటే రియల్మీ ఫోన్ బాగా పెర్ఫామ్ చేసింది. రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ 3 శాతం ఖర్చు కాగా, వివో టీ3 అల్ట్రా బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. మీరు ఎక్కువగా వీడియోలు చూసే వారైతే మీకు రియల్మీ జీటీ 6టీ బాగా సరిపోతుంది. డిస్ప్లే విషయానికి వస్తే, రెండు ఫోన్లలో 6.7-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి. అయితే రియల్మీ 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఆఫర్ చేస్తుంది. వివో టీ3 అల్ట్రా లో 4500 నిట్స్ బ్రైట్నెస్ అందించారు.
విజేత: Realme GT 6T
గేమింగ్
గేమింట్ టెస్ట్ కోసం మా టెస్టింట్ టీమ్ రెండు ఫోన్లలో ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున 3 గేమ్‌లను ఆడటం జరిగింది. మరి ఈ టెస్ట్ తర్వాత ఫలితాలు ఏ విధంగా నమోదయ్యాయో క్రింద టేబుల్ లో అందించాం. ఓసారి చూడండి.
| గేమ్స్ | వివో టీ3 అల్ట్రా బ్యాటరీ డ్రాప్ | రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ డ్రాప్ |
| కాల్ ఆఫ్ డ్యూటీ – మొబైల్ | 9 శాతం | 6 శాతం |
| రియల్ రేసింగ్ | 6 శాతం | 6 శాతం |
| బీజీఎంఐ | 8 శాతం | 8 శాతం |
రియల్మీ జీటీ 6టీ రూ.50,000 లోపు ధరలో ఈ ఏడాది బెస్ట్ గేమింగ్ ఫోన్లలో ఒకటిగా నిలిచింది. వివో టీ3 అల్ట్రా కంటే రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ ఎంతో ఎఫిషియంట్ గా పని చేసింది. గేమింగ్ టెస్ట్ తర్వాత రియల్మీ జీటీ 6టీ బ్యాటరీ 7 శాతం ఖర్చయ్యింది. వివో టీ3 అల్ట్రా బ్యాటరీ 8 శాతం ఖర్చయ్యింది. గేమ్ ఆడుతున్నప్పుడు రియల్మీ జీటీ 6టీ యొక్క టెంపరేచర్ 4.9 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. వివో టీ3 అల్ట్రా యొక్క టెంపరేచర్ 6 డిగ్రీలు పెరిగింది.
విజేత: Realme GT 6T
చార్జింగ్
రియల్మీ జీటీ 6టీ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. వివో టీ3 అల్ట్రా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ స్పీడ్ ఎక్కువ కాబట్టి, రియల్మీ జీటీ 6టీ ఫోన్ పైచేయి సాధిస్తుందని అంచనా వేయవచ్చు. మరి, 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు ఏ ఫోన్‌కి ఎంత సమయం పట్టిందో తెలుసుకుందాం.
| టెస్ట్ | వివో టీ3 అల్ట్రా | రియల్మీ జీటీ 6టీ |
| చార్జింగ్ టైమ్ (20%-100%) | 32 నిమిషాలు | 38 నిమిషాలు |
రియల్మీ జీటీ 6టీ కి 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 32 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, వివో టీ3 అల్ట్రా కి 38 నిమిషాల టైమ్ పట్టింది.
ఏది బెటర్?
రియల్మీ జీటీ 6టీ ఫోన్, వివో టీ3 అల్ట్రా కంటే బ్యాటరీ ఎఫిషియన్సీలో మెరుగ్గా ఉందని అన్ని టెస్టుల ద్వారా నిరూపితమైంది. అయితే రెండింటి మధ్య తేడా చాలా తక్కువే. కాబట్టి, వివో టీ3 అల్ట్రాను కూడా తీసిపారేయలేం.
ఈ కంపేరిజన్ లో రియల్మీ జీటీ 6టీ విజేతగా నిలిచింది. కానీ, మీకు రూ.40,000 నుంచి రూ.50,000 సెగ్మెంట్ లో మంచి బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్ కావాలంటే, మీరు వివో వీ30 మరియు వన్‌ప్లస్ 12ఆర్ లను ప్రయత్నించవచ్చు. ఈ ఫోన్లు హయ్యస్ట్ పీసీమార్క్ బ్యాటరీ స్కోర్స్ కలిగి ఉన్నాయి. ఇవి కేవలం బ్యాటరీ లైఫ్ లోనే కాదు, చార్జింగ్ స్పీడ్ లోనూ సెగ్మెంట్ బెస్ట్ గా ఉన్నాయి.
రూ.40,000 నుంచి రూ.50,000 సెగ్మెంట్ లో మీకు మంచి పెర్ఫామెన్స్ కావాలనుకుంటే, రియల్మీ జీటీ 6టీ మరియు వివో టీ3 అల్ట్రా మిమ్మల్ని నిరాశ పరచవు.












