ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఏప్రిల్ 17వ తేదీన భారత్ లో వివో టీ3ఎక్స్ 5జీ లాంచ్ అవుతుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo T3x 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo T3x 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు
త్వరలో లాంచ్ కాబోయే Vivo T3x 5G గీక్‌బెంచ్ పై V2338 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
Vivo T3x 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 946 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2839 పాయింట్లు స్కోర్ చేసింది.
ఈ వివో ఫోన్ ఆక్టా-కోర్ట్ చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. దీని హై క్లాక్ స్పీడ్ 2.21GHz. అడ్రెనో 710 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో వాడినట్లు గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
ప్రాసెసర్ వివరాలను బట్టి, Vivo T3x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.
గీక్‌బెంచ్ డేటాబేస్ పై వివో టీ3ఎక్స్ 5జీ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.
Vivo T3x 5G వివరాలు (ఖరారైనవి)
Vivo T3x 5G యొక్క మైక్రో-సైట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై దర్శనమిస్తోంది. ఆ మైక్రో-సైట్ ద్వారా డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 5,60,000 అంటుటు బెంచ్‌మార్క్ పాయింట్స్ మైక్రోసైట్ ద్వారా కన్ఫర్మ్ అయ్యాయి.
Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ సెలెస్టియల్ గ్రీన్ మరియు క్రిమ్సన్ బ్లిస్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది.
డిజైన్ విషయానికి వస్తే, బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, రెండు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
Vivo T3x 5G ధర రూ.15,000 లోపు ఉంటుందని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెలుస్తోంది.
Vivo T3x 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: Vivo T3x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
ర్యామ్, స్టోరేజీ: Vivo T3x 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.
కెమెరా: Vivo T3x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Vivo T3x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Vivo T3x 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటాయి.
