హైలైట్స్:
- ఆగస్టు 25 న థాయిలాండ్ లో లాంచ్ కానున్న వివో వీ25 5జీ
- కంపెనీ యొక్క వీ25 సిరీస్ లో కొత్త హ్యాండ్సెట్ వీ25 5జీ
- డైమెన్సిటీ 900 చిప్సెట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 90 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
భారత్ లో వివో వీ25 ప్రో లాంచ్ అయిన కొన్ని రోజులకు, వివో నుంచి వీ25 సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. వివో వీ25 5జీ అనే ఈ హ్యాండ్సెట్ వచ్చే వారం థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. వివో వీ23 5జీ స్మార్ట్ ఫోన్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇక కంపెనీ నుంచి వీ24 సిరీస్ ఉండబోదని తెలుస్తోంది. ప్రో మోడల్ తో పాటే వివో వీ25 5జీ కూడా లాంచ్ కావాల్సి ఉంది. కానీ, ఈవెంట్ లో ఈ మోడల్ పై వివో మౌనంగానే ఉంది. తాజాగా జీఎస్ఎంఅరేనా వివో వీ25 సిరీస్ లో భాగమైన వివో వీ25 5జీ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తో కూడిన ప్రెస్ రిలీజ్ ను బయటకు వదిలింది. ఇప్పటి వరకు వివో వీ25 5జీ గురించి మాకు తెలిసిన వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓ కన్నేయండి.
Vivo V25 5G లాంచ్ తేదీ
ถ่ายภาพพอร์ตเทรตในค่ำคืนพิเศษของคุณ ให้สวยคมชัดกว่าที่เคย ไปพร้อมกับใบเฟิร์น และ vivo V25 5G ✨
พบกันในงานเปิดตัว 25 ส.ค. 65 นี้#V25Series5GLaunch#พอร์ตเทรตทุกคืนพิเศษของคุณ pic.twitter.com/Tna5qBQI1J
— vivo Thailand (@vivoThailand) August 19, 2022
వివో కంపెనీ తన థాయిలాండ్ అధికార ట్విట్టర్ హ్యాండిల్ పై వివో వీ25 5జీ యొక్క లాంచ్ తేదీని అధికారికంగా టీజ్ చేసింది. థాయి భాషలో ఉన్న ఈ ట్వీట్ లో ఏముందో తెలుసుకుందాం పదండి. “మీ ప్రత్యేక రాత్రి యొక్క పోట్రెయిట్స్ ను తీసుకోంది. ఫెర్న్ ఆకులతో మరియు వివో వీ25 5జీ తో మరెప్పటికీ ఎంతో అందంగా మలుచుకోండి. ఆగస్టు 25 వ తేదీన లాంచ్ ఈవెంట్ లో కలుద్దాం.” అని ట్వీట్ లో వివో సంస్థ రాసుకొచ్చింది. ఇక ఫోన్ ని కొనాలని ఆసక్తి కనబరిచే వారు, మొత్తం మూడు రంగుల్లో వివో వీ25 5జీ ని కొనుగోలు చేయవచ్చు. అవి: ఆక్వామరైన్ బ్లూ, సన్ రైజ్ గోల్డ్, డైమండ్ బ్లాక్. అయితే వివో వీ25 5జీ యొక్క ధరకు సంబంధించిన అప్డేట్ ఇంకా లేదు.
Vivo V25 5G స్పెసిఫికేషన్స్
ఇప్పుడు వివో వీ25 5జీ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. వివో వీ25 5జీ లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే హెచ్డీఆర్ 10+ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇక ఈ హ్యాండ్సెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ని అమర్చారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 44 వాట్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
Vivo V25 5G Specs
- 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
- మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ చార్జ్
- 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
- 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 50ఎంపి సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 12
ఇప్పుడు వివో వీ25 5జీ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ఓఐఎస్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపున 50ఎంపి భారీ కెమెరాను అమర్చడం విశేషం. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.













