హైలైట్స్:
- నేడు తొలిసారి భారత్ లో అమ్మకానికి వచ్చిన వివో వీ25 ప్రో
- ఫ్లిప్ కార్ట్, వివో ఈ-స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా జరగనున్న విక్రయాలు
- రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న వివో వీ25 ప్రో; ఫోన్ ధర రూ.35,999 నుంచి రూ.39,999
గత వారంలో వివో సంస్థ భారత్ లో వివో వీ25 ప్రో ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే వివో తన లైనప్ లో వీ24 ప్రో ని తీసుకు రావడం లేదు. వివో వీ23 ప్రో తర్వాత నేరుగా వివో వీ25 ప్రో లాంచ్ అయ్యింది. ఈఫోన్ ఏజీ ప్లోరైట్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. రంగులు మార్చడం ఈ హ్యాండ్సెట్ ప్రత్యేకత. నేడు, ఈ హ్యాండ్సెట్ భారత్ లో సేల్ కి వచ్చింది. వివో వీ25 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్లు, సేల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. పదండి.
భారత్ లో Vivo V25 Pro ధర, సేల్, ఆఫర్లు
ఫ్లిప్ కార్ట్, వివో ఈ-స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా నేటి నుంచి వివో వీ25 ప్రో ని కొనుగోలు చేయవచ్చు. ఈ వివో ఫోన్ రెండు రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ప్యూర్ బ్లాక్, సెయిలింగ్ బ్లూ. 8జిబి + 128జిబి బేస్ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. 12జిబి + 256జిబి టాప్ వేరియంట్ ధర రూ.39,999 గా నిర్ణయించారు.
హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్స్ ద్వారా వివో వీ25 ప్రో ఫోన్ ని కొనుగోలు చేస్తే, రూ.3500 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ కార్డ్ యూజర్లు వివో వీ25 ప్రో ఫోన్ కొనుగోలు పై రూ.750 డిస్కౌంట్ పొందుతారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా వివో వీ25 ప్రో ఫోన్ కొనేవారు గూగుల్ నెస్ట్ హబ్ ని రూ.4999 కి, గూగుల్ నెస్ట్ మినీ ని రూ.1999 కి సొంతం చేసుకోవచ్చు.
Vivo V25 Pro స్పెసిఫికేషన్స్
వివో వీ25 ప్రో లో 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్, 4830 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
Vivo V25 Pro Specs
- 6.56-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్
- 4830 ఎంఏహెచ్ బ్యాటరీ
- 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ
- 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 32ఎంపి ఫ్రంట్ కెమెరా
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్స్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.