హైలైట్స్:
- నెట్టింట్లో ప్రత్యక్షమైన వివో వీ25ఈ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్
- 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో రానున్న వివో వీ25ఈ
వివో వీ25ఈ కి సంబంధించిన ఒక కొత్త లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా ఫోన్ యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. వివో వీ25 5జీ, వివో వీ25ఈ లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చిన కొన్ని రోజులకే తాజా లీక్ బయటకు వచ్చింది. మరోవైపు వివో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో వీ25 ప్రో ని భారత్ లో లాంచ్ చేసింది. ఇంకా వీ25 సిరీస్ ఫోన్స్ రావాల్సి ఉంది. ఈలోపు, 91మొబైల్స్ హిందీ వివో వీ25ఈ కి సంబంధించిన రెండర్స్, క్రిటికల్ స్పెసిఫికేషన్స్ ను టిప్ స్టర్ సుదాన్శు అంభోరే సాయంతో వెలికి తీసింది.
అయితే వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్ యొక్క భారత ఎంట్రీ పై సదరు కంపెనీ ఇంకా మౌనంగానే ఉంది. కానీ, వచ్చే నెలలో ఫోన్ భారత గడ్డపై అడుగు పెట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు. మరి త్వరలో భారత్ లో లాంచ్ కానున్న వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం పదండి.
Vivo V25e డిజైన్, కలర్ ఆప్షన్స్ (లీక్డ్)
లీక్ ని బట్టి, వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. అవి: బంగారు వర్ణం, నలుపు రంగు. ఇక డిజైన్ విశేషాలను చూస్తే, వివో వీ25ఈ లో వాటర్ డ్రాప్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్, ఫోన్ వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ తో కూడిన భారీ యూనిట్, ఎల్ఈడీ ఫ్లాష్, బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో వివో బ్రాండింగ్ ఉన్నాయి. వివో వీ25ఈ చూడటానికి వివో వీ25 మాదిరి కనిపిస్తోంది. వెనుక నుంచైతే ఇది మరింత సమానమైన పోలికలను కలిగి ఉంది.
Vivo V25e Specs
- 64ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, ఓఐఎస్ సపోర్ట్
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 64ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ వివో వీ25ఈ స్మార్ట్ ఫోన్లో ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ని ఈ ఫోన్లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. అయితే, వివో వీ25ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియదు. త్వరలోనే ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. అప్పుడు స్పెసిఫికేషన్స్ పై పూర్తి స్పష్టత వస్తుంది.