ఈ నెలలోనే భారత్‌లో లాంచ్ కానున్న Vivo V27 4G; రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్!

Highlights

  • భారత్ లో ఈ నెలలో లాంచ్ కానున్న Vivo V27 4G
  • గ్రీన్, బర్గండి, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్
  • 6.64-ఇంచ్ డిస్ప్లే, హీలియో జీ85 చిప్‌తో రానున్న హ్యాండ్సెట్

Vivo V27 5G స్మార్ట్ ఫోన్ వర్షన్స్ భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయిన తర్వాత, తాజాగా కంపెనీ 4జీ వర్షన్ ని తీసుకొచ్చేందకు ప్రయత్నాలు చేస్తోంది. Vivo V27 4G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఈ నెలలోనే లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ తాజాగా Vivo V27 4G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ చేశారు. అలాగే మేం, Vivo V27 4G ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యే టైమ్‌లైన్ వివరాలను కూడా సంపాదించాం. ఆ విశేషాలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.

Vivo V27 4G ఇండియా లాంచ్ టైమ్‌లైన్

టిప్‌స్టర్ ఇషాన్ ప్రకారం, Vivo V27 4G డివైజ్ భారత్ లో ఈ నెలలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. రానున్న కొన్ని రోజుల్లో వివో సంస్థ Vivo V27 4G ని టీజ్ చేసే అవకాశం ఉంది. టీజర్స్ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Vivo V27 4G కలర్ ఆప్షన్స్

Vivo V27 4G స్మార్ట్ ఫోన్ గ్రీన్, బర్గండీ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని సమాచారం.

Vivo V27 4G డిజైన్

  • Vivo V27 4G లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, గుర్తించదగిన బాటమ్ చిన్, ప్లాస్టిక్ బ్యాక్ ని కలిగి ఉంటుంది.
  • Vivo V27 4G డివైజ్ కి కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎంబెడ్ చేయబడి ఉంటుంది.
  • Vivo V27 4G స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఈ రింగ్స్ కి పక్కనే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
  • రెండర్స్ ద్వారా యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే సెక్షన్ రివీల్ కాలేదు. అయితే ఇవి ఫోన్ కి బాటమ్ లో ఉండనున్నాయి.

Vivo V27 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V27 4G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V27 4G డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V27 4G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ ఆప్షన్ లో వస్తోంది. ఈ ఫోన్ లో 6జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ కూడా ఉండటం విశేషం.
  • ఓఎస్: Vivo V27 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • డైమెన్షన్స్: Vivo V27 4G డివైజ్ 164 మి.మీ పొడవు, 76.2 మి.మీ వెడల్పు, 8 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.