Home News కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 66వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Vivo V27

కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 66వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Vivo V27

Highlights
  • భారత్ లో అఫీషియల్ గా లాంచైన Vivo V27 స్మార్ట్ ఫోన్
  • కలర్-చేంజింగ్ బ్యాక్ ప్యానెల్, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చిన Vivo V27
  • భారత్ లో Vivo V27 ధర రూ.32,999 తో ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo భారత్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేసింది. ప్రామిస్ చేసినట్లుగానే వివో సంస్థ భారత్ లో Vivo V27, Vivo V27 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో తన కలర్ చేంజింగ్ టెక్నాలజీని కంటిన్యూ చేసింది. ఈసారి బేస్ మోడల్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది. దీంతో ఫోన్ చూడటానికి ఎంతో ప్రీమియమ్ గా కనిపిస్తోంది. ఇక సెల్ఫీ స్నాపర్ కోసం ఫ్రంట్ లో పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఇంకా భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ 66వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Vivo V27 సిరీస్ చైనాలో లాంచ్ అయిన వివో ఎస్16 కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. Vivo V27 ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వాడారు. సరే, ఓసారి Vivo V27 డివైజ్ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo V27 ధర, సేల్ తేదీ

Vivo V27 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.36,999 గా ఉంది. మార్చి 23 నుంచి ఈ హ్యాండ్సెట్ సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Vivo సంస్థ ఐసీఐసీఐ, కొటక్, హెచ్డీబీ బ్యాంక్ కార్డ్స్ పై 3500 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ మేజర్ రిటైలర్స్ అయిన రిలయన్స్ డిజిటల్, జియో డిజిటల్ లైఫ్, క్రోమా, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీత, బిగ్ సి, లాట్ తదితర ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్ ఆఫర్స విషయానికి వస్తే, HDFC, ICICI, KOTAK బ్యాంక్ కార్డ్స్ ద్వారా పేమెంట్ చేస్తే, రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2500 వరకు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ మరియు వివో అధికార వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

Vivo V27 5G స్పెసిఫికేషన్స్

Vivo V27 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు.

Vivo V27 లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్, కర్వ్డ్ ఎడ్జెస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.