ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo ఆగస్టు నెలలో యురోపియన్ మార్కెట్స్ లో Vivo V29 5G ని అనౌన్స్ చేసింది. అంతకుముందు యురోపియన్ మార్కెట్స్ లో Vivo V29 Lite ని కూడా అనౌన్స్ చేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం వివో సంస్థ భారతీయ మార్కెట్ లో Vivo V29e 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఆగస్టు 28 వ తేదీన Vivo V29e 5G ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఇదివరకు Vivo V29 5G యొక్క గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్స్ లాంచ్ టైమ్‌లైన్ ని రివీల్ చేశారు. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్లన ఈవెంట్ జాప్యమైంది. తర్వాత Vivo V29 సిరీస్ లో తొలుత Vivo V29e 5G భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ టిప్‌స్టర్ Vivo V29 5G డివైజ్ గ్లోబల్ లాంచ్ తేదీ, ఇండియన్ మార్కెట్ టైమ్‌లైన్ రివీల్ చేశారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
సెప్టెంబర్ 7 న లాంచ్ అవుతోన్న Vivo V29 5G
Vivo V29 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో సెప్టెంబర్ 7 న లాంచ్ కానుందని టిప్‌స్టర్ తన తాజా పోస్ట్ ద్వారా రివీల్ చేశారు. సెప్టెంబర్ చివరి వారంలో భారత్ లో Vivo V29 5G డివైజ్ లాంచ్ అవుతుందని పారస్ అంచనా వేసారు. Vivo V29 5G ధర రూ.30,000 నుంచి రూ.40,000 మధ్య ఉండవచ్చని టిప్‌స్టర్ తెలిపారు.
Vivo V29 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo V29 5G స్మార్ట్‌ఫోన్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి.
- చిప్సెట్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
- సాఫ్ట్వేర్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి కెమెరా, ఆరా లైట్ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా ఉంటుంది. ఇది డ్యూయల్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్లాష్ ని కలిగి ఉంటుంది.
- బ్యాటరీ: Vivo V29 5G లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo V29 5G డివైజ్ ఐపీ68 రేటింగ్, స్టీరియో స్పీకర్ సెటప్, హై-రెజ్ ఆడియో, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది.
- కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ 2.0 ఉంటాయి.
- డైమెన్షన్స్: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.
