ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo యూరోపియన్ మార్కెట్ లో Vivo V29 5G ని లాంచ్ చేసింది. అయితే ఫోన్ ధర ఇంకా రివీల్ కాలేదు. ఈ నెలలోనే భారత్ లో కూడా Vivo V29 5G లాంచ్ కానుందని సమాచారం. రానున్న రోజుల్లో భారత మార్కెట్ లాంచ్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo V29 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo V29 5G డిజైన్
Vivo V29 5G స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఆరా లైట్ రింగ్ అనేది కెమెరా సెన్సర్స్ క్రింద ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తక్కువ కాంతి ఉన్నప్పుడు కూడా యూజర్లు మెరుగైన పోట్రెయిట్స్ తీసుకునేందుకు ఈ ఆరా లైట్ ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ తో రావడం వల్లన నీరు మరియు దుమ్ము నుంచి భద్రత లభిస్తుంది.
Vivo V29 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, డీసీఐ పీ3 కలర్ గేముత్, ఎస్జీఎస్ ఐ ప్రొటెక్షన్ రేటింగ్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 642ఎల్ జీపీయూ అందించారు. ఉత్తమమైన పెర్ఫామెన్స్ కోసం ఈ ఫోన్ లో వీసీ బయోనిక్ కూలింగ్ సిస్టమ్ ని ఇన్‌స్టాల్ చేసారు.
స్టోరేజీ: Vivo V29 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.
కెమెరా: Vivo V29 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఓఐఎస్ ఫీచర్ అందించారు.
బ్యాటరీ: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 18 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
ఇతర ఫీచర్లు: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్ 5జీ, ఐపీ68 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
