50MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 5G

Highlights

  • భారత్‌లో లాంచైన Vivo V29 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo V29, V29 Pro
  • Vivo V29 ధర ప్రారంభ రూ.32,999

Vivo V29 సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. అవి: Vivo V29, Vivo V29 Pro. Vivo V29 సిరీస్ డివైజెస్ 12జిబి వరకు ర్యామ్, ఆరా లైట్, 6.78-ఇంచ్ భారీ అమోలెడ్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఈ ఆర్టికల్ లో స్టాండర్డ్ మోడల్ Vivo V29 ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 ధర, లభ్యత

  • Vivo V29 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
  • Vivo V29 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. టాప్ వేరియంట్ ధరను రూ.36,999 గా నిర్ణయించారు.
  • స్పేస్ బ్లాక్, మ్యాజికల్ రెడ్, హిమాలయన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
  • అక్టోబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్ మొదలవుతుంది.
  • నేటి నుంచి Vivo V29 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్ కూడా మొదలైంది.

Vivo V29 కెమెరా విశేషాలు

  • Vivo V29 డివైజ్ ప్రత్యేకత ఏంటంటే, ఎక్స్‌లెంట్ కెమెరాను ఈ ఫోన్ అందిస్తోంది. 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం.
  • ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50ఎంపి ప్రైమరీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. అలాగే 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి.
  • బ్యాక్ కెమెరాలో ఆరా లైట్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని ద్వారా నైట్ ఫోటోగ్రఫీ మరింత మెరుగు కానుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కూడా ఈ ఫోన్ ఉత్తమమైన ఆప్షన్ అని కంపెనీ చెబుతోంది. సరే, ఓసారి Vivo V29 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V29 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: Vivo V29 5G డివైజ్ 8జిబి+128జిబి మరియు 12జిబి+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.
Previous article50MP OIS కెమెరా, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Samsung Galaxy S23 FE 5G
Next article80W చార్జింగ్, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.