Home News Snapdragon 695 చిప్, 120Hz డిస్ప్లే, 44W చార్జింగ్‌తో లాంచైన Vivo V29 Lite 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Snapdragon 695 చిప్, 120Hz డిస్ప్లే, 44W చార్జింగ్‌తో లాంచైన Vivo V29 Lite 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • చెక్ రిపబ్లిక్ లో లాంచైన Vivo V29 Lite 5G
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చిన డివైజ్
  • 8జిబి+128జిబి మోడల్ ధర CZK 8,499 (సుమారు రూ.31,900)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చెక్ రిపబ్లిక్ లో Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ హార్డ్‌వేర్ రీసెంట్ గా లాంచ్ అయిన Vivo Y78 5G గ్లోబల్ మోడల్ ని పోలి ఉంది. Vivo V29 Lite 5G డివైజ్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, డ్యూయల్ సర్క్యులర్ రింగ్స్, ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కర్వ్డ్ ఎడ్జెస్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

సరే, ఓసారి Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V29 Lite 5G ధర

Vivo V29 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం ఐ ప్రొటెక్షన్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ అందించారు.

ఓఎస్, బ్యాటరీ

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ, సెక్యూరిటీ

Vivo V29 Lite 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.