ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Vivo V29 Pro, Vivo V29 5G, Vivo V29e. ఇటీవలె Vivo V29 Pro డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించడంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని అర్థమైంది. ఇప్పుడు, వివో కంపెనీ Vivo V29 సిరీస్ గ్లోబల్ లాంచ్ టీజర్ ని బయటకు వదిలింది. దీంతో లాంచ్ తేదీ సమీపంలోనే ఉందని స్పష్టమవుతోంది.
Vivo V29 Pro BIS లిస్టింగ్
Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ V2251 అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ వెబ్ సైట్ పై కనిపించింది. మోడల్ నంబర్ కాకుడా, ఇతర వివరాలేవీ లిస్టింగ్ ద్వారా బయటకు రాలేదు. Vivo V29 Pro డివైజ్ ప్రీమియమ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫోన్ లో సూపర్బ్ ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతకు ముందు ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై కూడా కనిపించింది. దీంతో కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
Vivo V29 గ్లోబల్ టీజర్
వివో కంపెనీ Vivo V29 సిరీస్ గ్లోబల్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో Vivo V29 మోడల్ భారీ కెమెరా మాడ్యూల్ తో కనిపించింది. ఇందులో 2 సర్క్యులర్ కెమెరా కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ కెమెరా సెటప్ ని చూస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు, వివో బ్రాండింగ్ ఫోన్ కి బాటమ్ లో కనిపిస్తోంది. ఇకపోతే ఫోన్ కి కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.
Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
- ప్రాసెసర్: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ ఉంటుంది.
- స్టోరేజీ: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండవచ్చు.
- కెమెరా: Vivo V29 Pro డివైజ్ లో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50 ఎంపి కెమెరా అందించనున్నారు.
- బ్యాటరీ: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo V29 Pro డివైజ్ లో కలర్ చేంజింగ్ ప్యానెల్, డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.
- ఓఎస్: Vivo V29 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
